Posted on 2026-04-23 22:41:19
ఏఎస్పీ సేవలు జిల్లా పోలీస్ శాఖకు ఆదర్శప్రాయం – జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో పదోన్నతిపై సంగారెడ్డి జిల్లాకు బదిలీ అయిన అదనపు ఎస్పీ బి. చైతన్య రెడ్డి, IPS కి ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించబడింది. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, IPS అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొని ఆమెకు సాదరంగా వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, బి. చైతన్య రెడ్డి కామారెడ్డి సబ్‌డివిజన్‌లో పనిచేసిన కాలంలో విధి నిర్వహణలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారని ప్రశంసించారు. ముఖ్యంగా "Kids With Khaki" మరియు "Safe Kamareddy" వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా పోలీస్ వ్యవస్థను ప్రజలకు, చిన్నారులకు మరింత చేరువ చేయడంలో ఆమె విశేష కృషి చేశారని కొనియాడారు. జిల్లాలో Road Safety (రోడ్డు భద్రత)పై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, నేర నియంత్రణలో భాగంగా విస్తృతంగా CC Cameras ఏర్పాటు చేయించడంలో ఆమె పోషించిన పాత్ర ఎంతో కీలకమని ఎస్పీ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
గతంలో కురిసిన భారీ వర్షాల సమయంలో గురు రాఘవేంద్ర కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకున్నప్పుడు, ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తున్న అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో బి. చైతన్య రెడ్డి ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి, స్వయంగా జెసిబి ద్వారా వరద ఉధృతిలోకి వెళ్లి బాధితులను సురక్షితంగా రక్షించిన ఘటన ఆమెలోని అంకితభావాన్ని, సాహసాన్ని చాటిచెప్పాయని పేర్కొన్నారు.
She Teams ద్వారా మహిళా రక్షణకు పెద్దపీట వేయడమే కాకుండా, కేసుల దర్యాప్తులో అత్యంత నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ బాధితులకు న్యాయం చేకూర్చడంలో ఆమె ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
సహచర అధికారుల అభినందనల మధ్య ఎంతో భావోద్వేగంగా జరిగిన ఈ కార్యక్రమంలో, జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున ఆమెను ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. పదోన్నతిపై వెళ్తున్న ఆమె భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆమె సేవలు సమాజానికి మరింత మేలు చేకూర్చాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Posted On 2026-04-23 22:39:08
Readmore >
సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్
Posted On 2026-04-23 18:39:41
Readmore >