Posted on 2026-04-23 18:59:41
లింగాయపల్లి గ్రామంలో ఐదో వార్డుకు నూతన బోర మోటర్ ఏర్పాటు
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మండలం లింగాయపల్లి గ్రామంలోని ఐదో వార్డులో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నూతన బోరు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ రాజయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రాజయ్య మాట్లాడుతూ, ఉప సర్పంచ్ తోట శిరీష భూపతి గారు కొత్త మోటర్ ఇప్పించడం చాలా సంతోషంగా ఉంది గ్రామ ప్రజలకు తాగునీటి సమస్యలు లేకుండా చేయడం తమ ముఖ్య లక్ష్యమని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కృషి కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. కొత్త బోరు మోటర్ ఏర్పాటు వల్ల ఐదో వార్డు ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తీరనున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ శిరీష భూపతి, గ్రామ పంచాయతీ కార్యదర్శి నవనీత, గ్రామ పాలకవర్గ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఈ చర్యపై సంతోషం వ్యక్తం చేస్తూ, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Posted On 2026-04-23 22:39:08
Readmore >
సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్
Posted On 2026-04-23 18:39:41
Readmore >