Posted on 2026-04-03 08:59:16
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. జిల్లా పరిధిలోని కేశం బంకు సమీపంలో ఉన్న కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించడం స్థానికుల్లో భయాందోళనలకు దారి తీసింది.
స్థానికులు కాలువలో మృతదేహాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు ఎవరు? ఏ ప్రాంతానికి చెందినవారు? అనే విషయాలపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమానికి విచ్చేసిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-13 16:20:40
Readmore >
రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజల్లో మరింత చైతన్యం రావాలి : ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు
Posted On 2026-04-13 11:03:05
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >