| Daily భారత్
Logo




నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి 9 లక్షలకు పైగా బ్యాంకు రుణాలు పొందిన ముగ్గురు అరెస్ట్ : కల్లూరు ఏసీపీ

News

Posted on 2026-04-02 13:11:02

Share: Share


నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి 9 లక్షలకు పైగా బ్యాంకు రుణాలు పొందిన ముగ్గురు అరెస్ట్ : కల్లూరు ఏసీపీ

డైలీ భారత్, కల్లూరు: కల్లూరు డివిజన్, ఏన్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి బ్యాంకు రుణాలు పొందిన నలుగురిపై కేసు నమోదు చేసి, ముగ్గురు నిందుతులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు. 

ఏన్కూర్ గ్రామీణ బ్యాంకు శాఖా నిర్వాహకులు కె.వి. ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏన్కూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. విచారణలో భాగంగా 2024 ఏడాది లో బ్యాంకులో బంగారు ఆభరణాల విలువ నిర్ధారించే అధికారి (Gold Appraiser) శ్రీపాది సతీష్ (A1), శ్రీపాది మౌనిక (A2) (పరారీ) , రామచంద్రోజు జయమ్మ (A3),రామచంద్రోజు నరేష్ (A4)లు కుమ్మక్కై సుమారు 242.25 గ్రాముల బరువున్న నకిలీ బంగారు ఆభరణాలను అసలైనవిగా తాకట్టు పెట్టి (రూ. 9,53,000/-) తొమ్మిది లక్షల యాభై మూడు వేల విలువైన బంగారు రుణాలను పొందినట్లు పేర్కొన్నారు. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో ఇటీవల ఆ ఖాతాలు నిరర్థక ఆస్తులుగా (NPAs) మారాయని, దీంతో బ్యాంకు అధికారులు వేలం ప్రక్రియను చేపట్టారని తెలిపారు. ఆసమయంలో తాకట్టు పెట్టిన ఆభరణాలు నకిలీవని గుర్తించారని తెలిపారు. ఈనేపథ్యంలో నిందుతులైన శ్రీపాది సతీష్, రామచంద్రోజు జయమ్మ, రామచంద్రోజు నరేష్ లను అరెస్టు చేసి, న్యాయస్థానం ఎదుట హాజరుపరిచినట్లు చెప్పారు. A2 శ్రీపాది మౌనిక పరారీ ఉన్నట్లు తెలిపారు.

ఎవరైనా ఇటువంటి మోసపూరిత చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తప్పని ఏసీపీ అన్నారు.

Image 1

మేము కొన్ని తప్పులు చేశాము

Posted On 2026-04-12 22:37:33

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-04-12 18:47:01

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు

Posted On 2026-04-12 18:45:08

Readmore >
Image 1

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

Posted On 2026-04-12 16:53:08

Readmore >
Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >
Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >
Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >