డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల సహకార విద్యుత్ పంపిణీ సంస్థ విలీనంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఆ పార్టీ ముఖ్య నాయకులతో ఫోన్లో మాట్లాడారు. నేడు గ్రామాల్లో జరిగే ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. సెస్ విలీనాన్ని వ్యతిరేకిస్తూ, ఎన్పీడీసీఎల్లో విలీనం చేయకుండా, యధావిధిగా కొనసాగించేలా తీర్మానాలు చేయాలని పార్టీ నాయకత్వానికి తెలిపారు.
News
సెస్ విలీనంపై నిరసనలకు కేటీఆర్ పిలుపు..