| Daily భారత్
Logo




అక్రమ నిర్మాణము... నిలిపివేతకు కోర్టు స్టే ఆర్డర్

News

Posted on 2026-04-02 10:31:24

Share: Share


అక్రమ నిర్మాణము... నిలిపివేతకు కోర్టు స్టే ఆర్డర్

నిర్మాణ స్థానంలో ఇరు వర్గాల వాగ్వాదం 

ఎస్ఐకి పంచాయతీ సెక్రెటరీ ఫిర్యాదు 

100 నెంబర్ కు డయల్ చేసిన బాధితులు 

డైలీ భారత్, దోమకొండ : సుమారు కోటి రూపాయల విలువైన స్థలం కబ్జా విషయంలో కోర్టు అక్రమ నిర్మాణాలు ఆపివేయాలని ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడంతో దోమకొండలో స్వల్ప  ఉద్రిక్తత చోటు చేసుకుంది.

దోమకొండ మండల కేంద్రంలోని సర్వే నంబర్  1697  లో 9  గుంటల భూమి ఉంది. బుచ్చ మల్ల పోషవ్వ పేరిట ఉన్న భూమిని తప్పుడు నకిలీ పత్రాలతో ఇతరులు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో బాధితురాలు కామారెడ్డి కోర్టును ఆశ్రయించారు.

కామారెడ్డి అడిషనల్ జూనియర్ మెజిస్ట్రేట్ దీక్ష అక్రమ నిర్మాణాలను ఆపివేయాలని మూడు రోజుల క్రితం ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేశారు. వివాదాస్పద స్థలంలో భూమిని తప్పుడు పత్రాలతో ఖరీదు చేసిన శరత్ కుమార్ పనులు జరుపుతుండడంతో బాధితుల తరఫున బంధువులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అక్రమ నిర్మాణం పనులు నిలిపివేయాలని నిరసన చేపట్టారు. పనులు కొనసాగడంతో బాధితులు 100 నెంబర్ డయల్  చేశారు.

దోమకొండ ఎస్సై ప్రభాకర్కు పంచాయతీ కార్యదర్శి యాదగిరికి మండల అభివృద్ధి అధికారి తహసీల్దారులకు కోర్టు ఆర్డర్లను బాధితులు అందజేశారు.

కామారెడ్డి ఆర్డీవో ఆదేశిస్తే అక్రమ నిర్మాణాలు ఆపివేస్తానని దోమకొండ పంచాయతీ సెక్రెటరీ యాదగిరి బాధితులకు స్పష్టం చేశారు. 

బాధితులు గ్రామపంచాయతీ ముందు సర్పంచ్ ముందు తమ భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మిస్తున్నారని ఆందోళన చేపట్టి నిరసన తెలియజేశారు.

దొంగ డాక్యుమెంట్లతో నిర్మాణం…? కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్‌ను పట్టించుకోరా?

దోమకొండ మండల కేంద్రంలో 9 గుంటల స్థలంపై వివాదాస్పద నిర్మాణం కొనసాగుతుండటం స్థానికంగా ఆందోళనకు దారితీస్తోంది. దొంగ డాక్యుమెంట్లు సృష్టించి కొత్తగా నిర్మాణ పనులు చేపడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ విషయంపై బాధితులు కోర్టును ఆశ్రయించగా, 2026 మార్చి 25న కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ జారీ చేసినట్లు సమాచారం. అయినప్పటికీ, ఆ ఆదేశాలను పట్టించుకోకుండా నిర్మాణ పనులు యథావిధిగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ పంచాయతీ కార్యదర్శి యాదగిరిని సంప్రదించగా, “ఆర్డీవో కార్యాలయం నుంచి అధికారిక కాపీ అందిన తరువాత చర్యలు తీసుకుంటాం” అని సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.

కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ నిర్మాణం కొనసాగడంపై అధికారుల నిర్లక్ష్యం ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Image 1

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

Posted On 2026-04-12 16:53:08

Readmore >
Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >
Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >
Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >
Image 1

సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి

Posted On 2026-04-11 21:25:59

Readmore >
Image 1

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ జేఏసీ నిరంతరం పోరాటం

Posted On 2026-04-11 21:20:31

Readmore >
Image 1

డి-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్

Posted On 2026-04-11 20:02:47

Readmore >