| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

హనుమాన్ జయంతి ర్యాలీ మార్గాన్ని స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

హనుమాన్ జయంతి ర్యాలీ మార్గాన్ని స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

• ర్యాలీ రూట్ మ్యాప్ పరిశీలన – అధికారులకు కీలక ఆదేశాలు

• శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని విజ్ఞప్తి.

డైలీ భారత్, కామారెడ్డి జిల్లా : ఏప్రిల్ 02న హనుమాన్ జయంతి సందర్భంగా కామారెడ్డి పట్టణంలో నిర్వహించనున్న శోభాయాత్ర మార్గం  ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, IAS , జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, IPS  మంగళవారం స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్షించారు.

ర్యాలీ సజావుగా, శాంతియుత వాతావరణంలో జరిగేందుకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధికారులతో చర్చించి పలు కీలక సూచనలు చేశారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ర్యాలీ సాగే రూట్ మ్యాప్‌ను పరిశీలించిన వారు, మార్గంలోని ప్రధాన కూడళ్ల ను సందర్శించి ట్రాఫిక్ నియంత్రణ , బందోబస్తు ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు.

అనంతరం ర్యాలీ నిర్వహణ ప్రతినిధులతో కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించి, వేడుకలను క్రమశిక్షణతో నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్, ఎస్పీ లు  మాట్లాడుతూ, పట్టణంలోని ముఖ్య మార్గాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలు , సీసీటీవీల ద్వారా నిరంతరం నిఘా కొనసాగుతుందని తెలిపారు.

ఇతరులకు ఇబ్బంది కలగకుండా భక్తులు ,  నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించి ఈ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.                                     

ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి, IPS, ఎస్.హెచ్.ఓ నరహరి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మధుసూధన్ ,  ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Previous కలెక్టరేట్ వద్ద బకాయిల సాధన కొరకు రిటైర్డ్ ఉద్యోగస్తుల నిరసన
Next కామారెడ్డి ప్రీమియర్ లీగు : ఆన్లైన్ బ్రాడ్ కాస్టింగ్ కోసం రూ.1.20 లక్షల విరాళం
ADVERTISEMENT