| Daily భారత్
Logo




కలెక్టరేట్ వద్ద బకాయిల సాధన కొరకు రిటైర్డ్ ఉద్యోగస్తుల నిరసన

News

Posted on 2026-03-31 14:18:45

Share: Share


కలెక్టరేట్ వద్ద బకాయిల సాధన కొరకు రిటైర్డ్ ఉద్యోగస్తుల నిరసన

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లారపురుషోత్తం ఆధ్వర్యంలో రిటైర్మెంట్స్ బకాయిల సాధన కొరకు మంగళవారం రోజున నిరసన కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మల్లారపు పురుషోత్తం మాట్లాడుతూ.. 20 24 మార్చి నుండి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షన్ బకాయలు ప్రభుత్వము చెల్లించలేదని, ఇట్టి బకాయలు ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల రాష్ట్రా వ్యాప్తంగా బకాయిలు రాక మానసిక ఆందోళన కు గురై దాదాపు ఇప్పటివరకు 250 మంది మరణించడం జరిగినదని తెలిపారు. ఇట్టి బకాయల సాధన కొరకు రాష్ట్రంలోని అన్ని వర్గాల మద్దతు తో దాదాపు 24 మాసముల నుండి ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు, నిరాహార దీక్షలు చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. నిన్నటి వరకు జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వివిధ పార్టీల ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ప్రశ్నోత్తర సమయంలో అడిగినప్పటికీ కూడా ప్రభుత్వము నుండి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమం ద్వారా అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెంటనే స్పందించి రిటైర్డ్ ఉద్యోగులకు ప్రత్యేక నిధులు కేటాయించి ఏక మొత్తంలో గ్రీన్ ఛానల్ ద్వారా పెన్షనర్స్ కి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ద్యానపెళ్లి పరమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు జనపాల వెంకటయ్య, ముత్యాల ప్రభాకర్, బి.గోవిందరావు, జీవన్ రెడ్డి, జె.ప్రకాశ్ రావ్, రేపాక రాజు, ఎం.ఏ. రెహమాన్, కే.నరసయ్య, షాబుద్దీన్, సిహెచ్ రవీందర్, ఎస్ఆర్జె వెంకటేశ్వర్లు, ఏ శ్రీనివాస్, బి.తిరుపతి, కే.సురేష్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >
Image 1

సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

Posted On 2026-06-05 21:27:15

Readmore >
Image 1

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

Posted On 2026-06-05 20:42:30

Readmore >
Image 1

కాకినాడ రూరల్: సీనియర్ అసిస్టెంట్ ఇంటిపై ఏసీబీ దాడులు

Posted On 2026-06-05 20:39:30

Readmore >
Image 1

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

Posted On 2026-06-05 20:23:17

Readmore >