| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భూపాలపల్లి సీఐ నరేష్ కుమార్‌కు ఘన సన్మానం

భూపాలపల్లి సీఐ నరేష్ కుమార్‌కు ఘన సన్మానం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌతంపూర్‌కు చెందిన భూపాలపల్లి సీఐ నరేష్ కుమార్‌ను బీఆర్‌ఎస్ కొత్తగూడెం మజీ మండల అధ్యక్షులు ఎండీ హుస్సేన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి, స్మారక చిహ్నాన్ని అందజేశారు.

సీఐ నరేష్ కుమార్ విధుల్లో నిబద్ధతతో పనిచేస్తూ ప్రజలకు అందిస్తున్న సేవలను నాయకులు కొనియాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించడంలో ఆయన చూపుతున్న చొరవను ప్రశంసించారు.

ఈ సందర్భంగా సీఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల సహకారం ఉంటేనే శాంతి భద్రతలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు. సమాజంలో శాంతి, సామరస్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మజీ మండల అధ్యక్షుడు ఎండి హుస్సేన్, నాయకులు నజీర్,శ్యామ్, ఖాదర్, సతీష్, మోహన్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం సాదాసీదాగా జరిగినప్పటికీ ఆత్మీయ వాతావరణంలో సాగింది.

Previous గంజాయి కేసులలో నిందితుడిపై పీడీయాక్ట్ నమోదు చేసిన బూర్గంపాడు పోలీసులు
Next గడ్డి మందును నిషేధించాలని అసెంబ్లీలో తీర్మానం
ADVERTISEMENT