| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గంజాయి కేసులలో నిందితుడిపై పీడీయాక్ట్ నమోదు చేసిన బూర్గంపాడు పోలీసులు

గంజాయి కేసులలో నిందితుడిపై పీడీయాక్ట్ నమోదు చేసిన బూర్గంపాడు పోలీసులు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చెందిన షేక్.మున్వర్  గంజాయి అక్రమ రవాణా చేస్తున్నందుకు 2024,2025 సంవత్సరాలలో బూర్గంపాడు పోలీస్ స్టేషన్ నందు రెండు కేసులు,2024 లో లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ నందు  మరొకకేసు 2024లో ఏడుళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్లో మరొక కేసు నమోదు చేయడం జరిగింది. చివరిగా 2025 ఏప్రిల్ నెలలో దుండిగల్ పిఎస్ లో 98 కేజీల గంజాయిని సరఫరా చేస్తూ దొరకగాఅక్కడ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ ఐదు కేసులలో షేక్.మున్వర్  మొత్తం 287 కేజీల గంజాయిను సరఫరా చేస్తూ పాల్పడుతున్నందున అతనిపై పి ఐ టి ఎన్ డి పి సి ఎస్ యాక్ట్ (పీడియాక్ట్) కొరకు పాల్వంచ సబ్ డివిజన్ డిఎస్పీ ఆర్.సతీష్ కుమార్ సూచనలతో సీఐ కె.సతీష్  జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  పర్యవేక్షణలో సంబంధించిన ఆధారాలను క్షుణ్ణంగా  పరిశీలించి సీఐడి అడిషనల్ డీజిపి చారు సిన్హా ఐపిఎస్ 16.02.2026 నాడు డిటెన్షన్ ఆర్డర్ (నిర్భంద ఉత్తర్వులు) ను జారీ చేయగా 18.02.2026 నాడు డిటెన్షన్ ఆర్డర్ ప్రతులను షేక్.మున్వర్ కు అందజేసి చేసి అతనిని చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది.

17.03.2026 తేదీన అడ్వైజరీ బోర్డు (సలహా మండలి) షేక్.మున్వర్ పై వచ్చిన నిర్భంద ఉత్తర్వులపై విచారణ జరిపి భౌతిక,సాంకేతిక ఆధారాలను పరిశీలించి, పి ఐ టి ఎన్ డి పి సి ఎస్  (పిడియాక్ట్) యాక్ట్ ను సమర్థిస్తూ  సంవత్సర కాలం చర్లపల్లి జైల్లో నిర్బంధించాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుత సమాజంలో ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని,ప్రజల ఆరోగ్యంపై తీవ్ర  దుష్ప్రభావాన్ని చూపించే గంజాయి లాంటి మాదక ద్రవ్యాలను సేవించినా,సరఫరా(రవాణా) చేయడం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని,వారిపై ఉన్నతాధికారుల ఆదేశాలతో పీడియాక్ట్ లను నమోదు చేయడం జరుగుతుందని సీఐ సతీష్ తెలిపారు.అంతేకాకుండా పట్టుబడిన నిందితులు గంజాయి అక్రమ రవాణా ద్వారా సంపాదించిన ఆస్తులను కూడా కోర్టు ఉత్తర్వులతో జప్తు చేయడం జరుగుతుందని తెలియజేశారు.

Previous రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం : కామారెడ్డిలో "అరైవ్ అలైవ్-2026" అవగాహన కార్యక్రమం
Next భూపాలపల్లి సీఐ నరేష్ కుమార్‌కు ఘన సన్మానం
ADVERTISEMENT