| Daily భారత్
Logo




విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు.. కలెక్టర్ గరిమ అగ్రవాల్

News

Posted on 2026-03-30 18:21:22

Share: Share


విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు.. కలెక్టర్ గరిమ అగ్రవాల్

జిల్లాలోని కేజీబీవీలు, టీజీఎంఎస్ రెసిడెన్షియల్ విద్యాలయాలు, హాస్టళ్లకు 20 ఫ్రీజర్ల పంపిణీ

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో జిల్లాలోని జిల్లాలోని 13 కేజీబీవీలు, ఏడు టీజీఎంఎస్ హాస్టళ్లకు కలిపి 20 ఫ్రీజర్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రత్యేక చొరవతో సమకూర్చారు. 

ఈ సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ఆయా విద్యాలయాల బాధ్యులకు కలెక్టర్ సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తుందని వివరించారు. *ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో* భాగంగా జిల్లాలోని విద్యాలయాల విద్యార్థులకు వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో ప్రత్యేక వైద్య నిపుణులతో వైద్య పరీక్షలు, సేవలు అందిస్తుందని తెలిపారు. జిల్లాలోని రెసిడెన్షియల్ విద్యాలయాలు, హాస్టళ్లకు గత చలికాలంలో విద్యార్థులకు వేడి నీళ్లు అందించేందుకు ఇప్పటికే గీజర్లు అందించామని గుర్తు చేశారు. విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహార పదార్థాలను అందించేందుకు ఫ్రీజర్లు ఈరోజు ఆయా రెసిడెన్షియల్ విద్యాలయాలు, హాస్టళ్ల బాధ్యులకు అందజేసినట్లు తెలిపారు. ఈ ఫ్రీజర్ల ద్వారా విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలు, కూరగాయలు పాడైపోకుండా నిల్వ చేసుకోవచ్చనీ, పాలు, ఆకు కూరలు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలు స్వచ్ఛంగా అందించే అవకాశం ఉందని తెలిపారు. రెసిడెన్షియల్ విద్యాలయాల్లో శుభ్రమైన ఆహారం పదార్థాలు అందించడం, వ్యర్థాల నిర్వహణ, వసతి గృహాలలో మెరుగైన జీవన వాతావరణం కల్పించడానికి ఇన్సినరేటర్, వంటపాత్రలు కూడా గతంలో అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, జీసీడీవో పద్మజ, స్పెషల్  ఆఫీసర్స్, కేర్ టేకర్స్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు

Posted On 2026-06-06 22:16:35

Readmore >
Image 1

మ‌రో రెండు వారాలు హైడ్రా ప్ర‌జావాణికి విరామం

Posted On 2026-06-06 20:55:30

Readmore >
Image 1

సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్

Posted On 2026-06-06 20:53:26

Readmore >
Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >