Posted on 2026-03-30 17:54:51
మహిళలకు 2500/- హామీని వెంటనే అమలు చేయాలి
వివాహ సమయంలో తులం బంగారం ఇవ్వాలి
విద్యార్ధినీలకు స్కూటీలు పంపిణీ చేయాలి
హమీల అమలుకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలి.
ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత.
వైరా రూరల్ అధ్యక్షురాలు బాణాల వెంకట్రావమ్మ.
డైలీ భారత్, వైరా: మహిళలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మహిళలకు ఇచ్చిన హామీలను నేరవేర్చాలని, హామీల అమలు కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించాలి ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత, మండల అధ్యక్షురాలు బాణాల వెంకట్రావమ్మ అన్నారు. వైరా మండలం అష్టగుర్తి గ్రామంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) గ్రామ కమిటీని 19 మంది సభ్యులతో ఎన్నుకున్నారు. ఐద్వా అష్ణగుర్తి గ్రామం అధ్యక్షురాలుగా మోదుగు లక్మి, కార్యదర్శిగా కంచర్ల రమాదేవి, ఉపాధ్యక్షురాలుగా కంచర్ల అనూష, సహాయ కార్యదర్శిగా నారపోగు జమలమ్మ, కంచర్ల స్రవంతి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను అమలుకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గుడిమెట్ల రజిత, బాణాల వెంకట్రావమ్మ మాట్లాడుతూ ఆరు గ్యారంటీల పేరుతో మహిళలకు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన రెండున్నరేండ్లుగా వాటిని అమలు చేయకుండా మహిళలను మోసం చేసిందని, బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా ఇంకా మహిళలను మభ్యపెట్టాలని చూస్తున్నదని విమర్శించారు. వంద రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని మహిళలను నమ్మించి ఓట్లు వేయించుకొని, అధికారంలోకి వచ్చి 25 నెలలు గడిచినా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి మహిళకు నెలకు రూ.2500, పెళ్లి సమయంలో తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీ ఇస్తామని ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. హామీలిచ్చి బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా కాంగ్రెస్ మహిళలను మోసగించిందని విమర్శించారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలయ్యే వరకూ ఐద్వా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అష్ణగుర్తి సర్పంచ్ కంచర్ల అనిత, 9వ వార్డు మెంబర్ కంచర్ల వెంకటమ్మ, ఐద్వా గ్రామ కమిటీ సభ్యులు కంచర్ల మరియమ్మ, కంచర్ల బుల్లెమ్మ, కంచర్ల లక్ష్మి, కంచర్ల సునీత, కంచర్ల జయమ్మ, పెద్దప్రోలు చిన్న వెంకమ్మ, ఆదిమళ్ళ రమణ, మోదుగు దుర్గ, మోదుగు లలిత, గంధం బాగ్యమ్మ, గంధం శ్రావణి, ఆదిమళ్ళ వసంత, కారుమంచి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-06-06 22:16:35
Readmore >
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >