Posted on 2026-03-30 17:33:00
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టడంపై తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు గోకుల్ రామారావు హర్షం వ్యక్తం చేశారు.సోమవారం రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణంలో జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా న్యాయవాదులపై వివిధ రకాల దాడులు, హత్యలు, హత్యాయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు తమకు రక్షణ చట్టం కావాలని నిరంతరం పోరాటం కొనసాగించారని పేర్కొన్నారు.
న్యాయవాదుల రక్షణ చట్ట అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం, ఈరోజు అసెంబ్లీలో ఆ చట్టాన్ని ప్రవేశపెట్టడం ఆనందకరమైన విషయం అని ఆయన అభిప్రాయపడ్డారు.రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు విప్లవ రెడ్డి మాట్లాడుతూ, న్యాయవాదుల దీర్ఘకాలిక డిమాండ్‌ను నెరవేర్చుతూ ప్రభుత్వం ప్రొటెక్షన్ యాక్ట్‌ను తీసుకురావడం హర్షణీయమని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నూతన ప్రధాన కార్యదర్శి వోద్యారపు రవికుమార్, ఉపాధ్యక్షుడు బొడ్డు రమేష్ కుమార్,స్రవంతి,వోద్యారపుస్వప్న, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
మహిళల భద్రతే లక్ష్యం – ప్రజల్లో చైతన్యం నింపుతున్న కామారెడ్డి షీ టీమ్
Posted On 2026-06-07 13:06:00
Readmore >
ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా “ఫిట్ ఇండియా మూవ్‌మెంట్” సైక్లింగ్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-07 13:04:42
Readmore >
రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-06-06 22:16:35
Readmore >
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >