| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రోడ్డు నియమ నిబంధనలు పాటించాలి : ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం

రోడ్డు నియమ నిబంధనలు పాటించాలి : ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం

డైలీ భారత్, సూర్యాపేట: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈరోజు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో గల మాంగల్య షాపింగ్ మాల్ ఉద్యోగులకు రోడ్డు నియమాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించి రోడ్డు భద్రత ప్రమాదాల నివారణకు సంబంధించిన సూచనలు చేసిన సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం సూర్యాపేట పట్టణ ఎస్సై ఏడుకొండలు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భద్రతా కార్యక్రమాల గురించి పోలీస్ శాఖ వివరించడం జరుగుతుందని ఎస్సైలు తెలిపారు దీనిలో భాగంగానే రోడ్ అవగాహన కార్యక్రమాల ద్వారా వాహనదారులను ప్రజలను చైతన్యవంతం చేస్తున్నామని అన్నారు. ప్రమాదాల నివారణకు అవగాహన నియమాలు పాటించడమే ప్రధాన మార్గమని అన్నారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించాలని తప్పుడు మార్గంలో వాహనాలు నడపకూడదని ఎక్కడపడితే అక్కడ రోడ్లు దాటకూడదని కోరారు.

Previous ఎల్.పి.జి గ్యాస్ కొరత లేదు : కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
Next ఏసీబీ కి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
ADVERTISEMENT