జిల్లా ప్రజలు ఆందోళన చెందవద్దు,వందతులను నమ్మవద్దు
కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని, జిల్లాలో ఎల్.పి.జి గ్యాస్ కొరత లేదని జిల్లా ప్రజలు ఆందోళన చెందవద్దని, వందతులను నమ్మవద్దని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు.అమెరికా-ఇరాన్ కు జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో చమురు, ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని, ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడనుందని వస్తున్న వార్తలను ప్రజలు నమ్మవద్దని, యుద్దం ప్రభావం వలన జిల్లాలో ఎలాంటి ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని, ఇంతకు ముందు గ్యాస్ బుక్ చేసుకున్నా తరువాత సరఫరా ఉన్నట్లే ప్రస్తుతం కూడా అదే విధంగా గ్యాస్ సరఫరా ఉంటుందని, ఎలాంటి జాప్యం ఉండదని, జిల్లాలో సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, గృహ అవసరాలకు వినియోగించే ఎల్.పి.జి గ్యాస్ కు ఎలాంటి కొరత లేదని, అదేవిధంగా ఆసుపత్రులు, విద్యాసంస్థలకు చెందిన వసతి గృహాలు, అనాధ శరణాలయాలు, వృద్దాశ్రమాలు వంటి సంస్థలకు ఎలాంటి కొరత లేదని తెలుపుతూ, జిల్లా ప్రజలు గ్యాస్ పై వస్తున్న అవాస్తవాలను, వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.