| Daily భారత్
Logo




అల్మాస్ పూర్ వద్ద ఉన్న కేజీబీవీలో ఆకస్మిక తనిఖీ చేసిన సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

News

Posted on 2026-02-22 03:26:01

Share: Share


అల్మాస్ పూర్ వద్ద ఉన్న కేజీబీవీలో ఆకస్మిక తనిఖీ చేసిన సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

డైలీ భారత్, సిరిసిల్ల: పదో తరగతి విద్యార్థులు అన్ని సబ్జెక్టులు చదవాలి రాయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ వద్ద ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ శనివారం తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లు పరిశీలించారు. కిచెన్, వంట గది, స్టోర్ రూమ్, భోజనానికి వినియోగించే ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. తరగతి గదుల్లో బోధన కొనసాగుతుండగా, పరిశీలించారు. పదో తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. అన్ని సబ్జెక్టుల సిలబస్ పూర్తి అయిందా అని ఇంచార్జి కలెక్టర్ ఆరా తీశారు. సైన్స్ కు సంబంధించి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులతో నాడీకణ నిర్మాణ నమూనాను బోర్డుపై గీసి దాని భాగాలు వివరిం చాలని సూచించారు. పలువురు విద్యార్థులు గీయగా, వారిని అభినందించారు. ఈ సందర్బంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకమని తెలిపారు. విద్యార్థులు ఒక ప్రణాళిక రూపొందించుకొని ప్రతి సబ్జెక్టుకు సంబంధించి గత ప్రశ్నాపత్రాలు సాధన చేయాలని సూచించారు. ఆ సమాధానాలను మరోసారి సమీక్ష చేసుకోవాలని పేర్కొన్నారు. పదో తరగతి మార్కులే ఉన్నత విద్యాభ్యాసంలో కీలకంగా మారుతాయని వివరించారు. ఇప్పటి అంశాలే రానున్న తరగతుల్లో మరింత విస్తృతంగా ఉంటాయని తెలిపారు. మంచిగా చదివి వివిధ ఉన్నత ఉద్యోగాలు, వృత్తుల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. కెరీర్ లో స్థిరపడిన తరువాతే మిగితా విషయాలు ఆలోచించాలని సూచించారు.

నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

విద్యాలయంపైన అదనపు తరగతి గదుల నిర్మాణాలపై టీజీఈడబ్ల్యూఐడీసీ ఏఈల నుంచి ఆరాతీశారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ ఆదేశించారు.


#rajannasircilla #sircillacollector #garimaagrawal  #sircilla_rajanna_district

Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >
Image 1

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనర్

Posted On 2026-08-02 09:35:33

Readmore >
Image 1

స్వర్ణ కాంతుల్లో భారత వనితలు... రింగులో రికార్డుల పంట!

Posted On 2026-08-02 07:32:52

Readmore >
Image 1

సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్...

Posted On 2026-08-01 19:13:32

Readmore >
Image 1

నామినేటెడ్ పోస్టులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Posted On 2026-08-01 19:11:17

Readmore >
Image 1

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-08-01 18:43:13

Readmore >