Posted on 2026-02-20 14:22:43
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్ మున్సిపాలిటీ నూతన చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అందే మోహన్ లకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం వారిని సీనియర్ నాయకులు ఎం.డి. ఇబ్రహీం పలువురు ముఖ్య నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎం.డి. ఇబ్రహీం మాట్లాడుతూ.. అనుభవజ్ఞులైన నాయకులు మున్సిపల్ బాధ్యతలు చేపట్టడం సంతోషకరమని, వారి నాయకత్వంలో షాద్‌నగర్ పట్టణం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు. పట్టణంలోని మౌలిక సదుపాయాల కల్పనలో నూతన పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇసాక్, ముబారక్,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >