Posted on 2026-02-20 15:58:03
ఐడీఓసీలో నిర్వహించిన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : ఆర్థిక పునరావాస సహాయ పథకానికి సంబంధించి జిల్లాలోని ఆయా మండలాల నుంచి దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. దివ్యాంగుల ఆర్థిక సహాయ పునరావాస పథకం కింద జిల్లాకు 14 యూనిట్లు మంజూరు కాగా ఒక్కో యూనిట్ విలువ రూపాయలు 50,000 వేలు. 100 శాతం రాయితీ ఉంటుంది. జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన 38 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం(ఐడీఓసీ)లో శుక్రవారం దివ్యాంగులకు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. 37 మంది దివ్యాంగులు హాజరుకాగా, వారికి సంబంధించిన సర్టిఫికెట్లు, అర్హతలు పరిశీలించి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో డీఆర్డీఓ గీత, డీడబ్ల్యూఓ లక్ష్మీరాజం, ఎస్సీ కార్పొరేషన్ అధికారి స్వప్న, ఏవో మెప్మా మీర్జా ఫసహత్ అలీ బేగ్ ఉన్నారు.
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >