Posted on 2026-02-14 03:45:48
డైలీ భారత్ స్పెషల్: శీర్షిక : మహాశివరాత్రి
మునిజనంబులు, దేవగణంబులు
పొగడగ ఒంటికి తోలుచుట్టి నుదుట
విభూతి ధరించి నిరాడంబరంగా
నిష్కల్మషంగా బతకడం లో
అర్ధం,పరామార్ధముందని
గ్రహించి నడవాలిని చెప్పకనే చెప్పిన మోక్ష పద్రాత..!
స్త్రీశక్తివిశిష్టతను తెలియచెప్పేందుకు
అర్ధనారీశ్వర రూపంలో అవతరించి
ఆచరణలోనూ, ఆలోచనలోనూ
కర్మలలోను, ఒకటిగా చెరిసగముగా
ఉండాలని చెప్పిన ఓ వరపద్రాత..!
పప్రంచ మేలు కోసము కాలకూటం
విషాన్ని గళంలో దాచిన గరళ కంఠుడా..!
మంగళానికే మంగళకరుడైన దేవ
అందుకో అందుకో మా వందనాలు..!
దివి నుండిపెద్దశబ్దం చేసుకుంటూ
వస్తున్న గంగమ్మను పుడమి
ముక్కలు కాకుండా జటాజూటాల
నుండి భువికి దింపిన గంగాధర..!
మంగళానికే మంగళకరుడైన దేవ
అందుకో అందుకో మా మంగళహారతులు..!
లింగోద్భవం జరిగిన మహాశివరాత్రి
పర్వదినాన శివుని ఆశీస్సులు మీకు,
మీ కుటుంబ సభ్యులకు ఉండాలని
కోరుకుంటూ..
మహాశివరాత్రి శుభాకాంక్షలు 2026
శ్రీమతి మంజుల పత్తిపాటి(కవయిత్రి)
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >