Posted on 2026-02-10 13:03:20
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, చొప్పదండి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల పరిశీలన
డైలీ భారత్, కరీంనగర్: జిల్లాలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, చొప్పదండి, జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీలకు బుధవారం నిర్వహించనున్న ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు.
2వ మున్సిపల్ సాధారణ ఎన్నికలు-2026లో భాగంగా కరీంనగర్ జిల్లాలో పోలింగ్ జరగనున్న కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా చొప్పదండి మున్సిపాలిటీకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను చొప్పదండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేశారు.
ఈ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం సందర్శించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లోని ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్న ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల సామాగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే రూట్, మానిటరింగ్ అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను పాటిస్తూ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల సామాగ్రితో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లోనే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, అధికారులు సూచించిన చోటే బస చేయాలని ఆదేశించారు.
చొప్పదండిలో పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు.
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >