Posted on 2026-02-10 14:20:29
స్పీడ్ బ్రేకర్లు, మోరీలు లేక నిత్యం రోడ్డు ప్రమాదాలు
తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజల డిమాండ్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఅశ్వాపురం మండలం మల్లెల మడుగు మీదుగా భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారి (ఆర్‌అండ్‌బీ రోడ్డు)పై నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా మల్లెల మడుగు సరిహద్దులోని సర్గం పాలన చింత చెట్టు వద్ద ప్రమాదాల తీవ్రత అధికంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ రహదారిపై స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, అలాగే కలవట్ల వద్ద మోరీలు లేకపోవడం వల్ల వాహనదారులు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆర్‌అండ్‌బీ శాఖ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదాలకు ప్రధాన కారణమని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు.
ప్రతి రోజూ వాహనాల రాకపోకలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో ఇప్పటివరకు సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని గ్రామస్తులు అంటున్నారు. గతంలో అనేక ప్రమాదాలు జరిగినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
ఇప్పటికైనా ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు స్పందించి ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను గుర్తించి వెంటనే స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు, మోరీలు ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళనకు దిగుతామని ప్రజలు హెచ్చరిస్తున్నారు
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >