| Daily భారత్
Logo




సిరిసిల్ల 18వ వార్డు "హస్త"గతమే.. ?

News

Posted on 2026-02-10 13:01:30

Share: Share


సిరిసిల్ల 18వ వార్డు "హస్త"గతమే.. ?

డైలీ భారత్, సిరిసిల్ల: విద్యావంతుల సంపూర్ణ మద్దతు. అధికార పార్టీ వైపే అందరి చూపు.. గెలుపు దిశగా కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల మున్సిపల్ ఓటర్లలో మార్పు కనిపిస్తోంది. అధికార పార్టీ అభ్యర్ధుల వైపు మొగ్గు చూపే దిశగా పరిణామాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ తన అభ్యర్థిని ఎంపిక చేసిన విషయంలో నాటకీయ పరిణామాలు, సిట్టింగ్ కౌన్సిలర్ కు కేటాయించిన టికెట్ ను ఆఖరి నిమిషంలో రద్దు చేయడంతో ఆ పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురయ్యారు. అదే పార్టీకి చెందిన మరో అభ్యర్థికి టికెట్ కేటాయించడంతో ఓటర్లలో గందరగోళం ఏర్పడింది. కాగా కాంగ్రెస్ పార్టీ విద్యాధికులు,  ఉపాధ్యాయులు అయిన గెంట్యాల రేణుక భూమేష్ కు కేటాయించడం కలసి వస్తోంది. వార్డులో ఉన్న మెజారిటీ కుటుంబాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు విద్యావంతుల మద్దతు లభించింది. ఈసారి విద్యాధికులకు కౌన్సిలర్ గా పట్టం కట్టాలనే నిర్ణయానికి ఓటర్లు వచ్చినట్లు తెలుస్తోంది. విస్తృతంగా ఉన్న ప్రజా సంబంధాలు, ఎలాంటి మచ్చ లేని వ్యక్తిత్వం, సమాజ సేవపై ఉన్న నిబద్ధత కారణంగా కాంగ్రెస్ అభ్యర్థికి అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తోంది. బీజేపీ అభ్యర్థి కేవలం గతంలో స్వల్ప ఓట్లతో ఓడిపోయానని. ఈసారి అవకాశం ఇవ్వాలని ప్రచారం చేస్తూ సానుభూతి ఓట్లకోసం ప్రయత్నిస్తున్నారు. మరో స్వతంత్ర అభ్యర్థి సైతం బరిలో ఉంటూ ఓట్లు చీల్చే అవకాశం ఉండడం కూడా కాంగ్రెస్ అభ్యర్థికీ కలిసివచ్చేలా ఉంది. దీంతో ఆ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >
Image 1

చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...

Posted On 2026-08-07 15:27:03

Readmore >
Image 1

మున్సిపల్ సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి...

Posted On 2026-08-07 14:59:52

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి

Posted On 2026-08-07 14:58:17

Readmore >
Image 1

మెగా రక్తదాన శిబిరం విజయవంతం... 98 యూనిట్ల రక్త సేకరణ

Posted On 2026-08-07 14:55:55

Readmore >
Image 1

పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-07 14:53:14

Readmore >
Image 1

"ప్రాణాలు కాపాడండి" అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు...

Posted On 2026-08-07 12:34:53

Readmore >
Image 1

హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి

Posted On 2026-08-07 12:07:52

Readmore >
Image 1

భర్తను చంపేందుకు భార్య, ప్రియుడి కుట్ర...

Posted On 2026-08-07 11:48:51

Readmore >
Image 1

నేతన్న నెత్తుటి నూలు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-07 06:40:06

Readmore >