| Daily భారత్
Logo




ఆర్థిక అవగాహన పెంపొందించాలి : ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

News

Posted on 2026-02-09 18:02:32

Share: Share


ఆర్థిక అవగాహన పెంపొందించాలి : ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

ఆర్థిక అక్షరాస్యత పోస్టర్ల ఆవిష్కరణ

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆద్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత వారం సంద ర్భంగా రూపొందించిన అవగాహన పోస్టర్లను జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ) సభ్యుల సమక్షంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. జనాభాలోని వివిధ వర్గాలలో ఆర్థిక అవగాహనను పెంపొందించే లక్ష్యంతో ఆర్బీఐ ఆర్థిక అక్షరాస్యత వారాన్ని అమలు చేస్తుందని వివరించారు. ఈ నెల 09 వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కేవైసీ - సురక్షిత బ్యాంకింగ్‌కు మీ మొదటి అడుగు అనే థీమ్‌తో పాటించాలని ప్రతిపాదించారని తెలిపారు. నో యువర్ కస్టమర్ (కేవైసీ), సెంట్రల్ కేవైసీ రిజిస్ట్రీ (సీకేవైసీ కేవైసీ సంబంధిత మోసాలు మనీ మ్యూలింగ్‌కు వ్యతిరేకంగా జాగ్రత్తలతో సహా, ఖాతా క్రమశిక్షణను పాటించడం, ప్రజలలో అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఎల్‌డీఎం) సమన్వయంతో జిల్లాస్థాయిలో అనేక ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ఆర్బీఐ, బ్యాంకులు ఎప్పుడూ మెయిల్‌లు, ఎస్ఎంఎస్ లు పంపదు లేదా బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లు మొదలైన వ్యక్తిగత సమాచారాన్ని అడిగే కాల్‌లు చేయదని స్పష్టం చేశారు. వివిధ సోషల్ మీడియాల ద్వారా మొబైల్ ఫోన్లకు వచ్చే ఆఫర్లు, లింకులు, ఫోన్లకు స్పందించ వద్దని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున రావు, వివిధ బ్యాంకుల మేనేజర్లు తదితరులు ఉన్నారు.

Image 1

ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ

Posted On 2026-02-09 20:31:57

Readmore >
Image 1

న్యూ ఎస్సీ కాలని లో నిట్ట నాగమణి దశదినకర్మ కార్యక్రమానికి ఆర్ధిక సాయం అందిందించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కాకర్ల గ్రామానికి చెందిన నాయకులు దొండపాటి శీనన్న యువసేన

Posted On 2026-02-09 20:22:59

Readmore >
Image 1

డబుల్ బెడ్ రూంలు పూర్తి చేయాలి : ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-02-09 19:41:49

Readmore >
Image 1

ఆర్థిక అవగాహన పెంపొందించాలి : ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-02-09 18:02:32

Readmore >
Image 1

సొంత పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నదేవరు?

Posted On 2026-02-09 16:52:10

Readmore >
Image 1

సిరిసిల్ల 38వ వార్డులో జోరుగా బిజెపి ప్రచారం

Posted On 2026-02-09 12:11:12

Readmore >
Image 1

ఎన్నికలు జరిగే మున్సిపల్ పరిధిలో బయటి వ్యక్తులు వుండరాదు

Posted On 2026-02-09 10:09:26

Readmore >
Image 1

48 గంటల్లోనే హత్య కేసును ఛేదించిన పిట్లం పోలీసులు

Posted On 2026-02-08 21:30:21

Readmore >
Image 1

కోట గుళ్ళ లో ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకాన్ ప్రత్యేక పూజలు

Posted On 2026-02-08 20:31:00

Readmore >
Image 1

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తోనే మున్సిపల్ అభివృద్ధి సాధ్యం : మొహమ్మద్ ఇబ్రహీం

Posted On 2026-02-08 20:27:56

Readmore >