| Daily భారత్
Logo




వైరా మున్సిపాలిటీలో ఎన్నికల్లో సిపిఐ(ఎం) పోటీ

News

Posted on 2026-01-11 20:44:02

Share: Share


వైరా మున్సిపాలిటీలో ఎన్నికల్లో సిపిఐ(ఎం) పోటీ

సమస్యలపై పోరాడే సిపిఐ(ఎం)ను ఆదరించండి

సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం

డైలీ భారత్, వైరా:వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో సిపిఐ(ఎం) పార్టీ పోటీ చేస్తుందని, రానున్న మున్సిపాలిటీ ఎన్నికలలో వైరా మున్సిపాలిటీలో సిపిఐ(ఎం) పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భుక్యా వీరభద్రం కోరారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ -1, సుందరయ్య నగర్-2, మహిళా శాఖల పరిధిలోని పార్టీ సభ్యులు, ముఖ్యుల జనరల్ బాడీ సమావేశం స్థానిక బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో పట్టణ నాయకులు గుడిమెట్ల మోహన్ రావు అద్యక్షతన జరిగింది.  ఈ సందర్భంగా భూక్యా వీరభద్రం మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాడే సిపిఎం పార్టీని ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీలో జరిగిన అవినీతీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో సిపిఎం కృషి చేస్తుందని తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు కేటాయించాలని, ఇంటి పన్నులు తగ్గించాలని, అన్ని వార్డులలో డ్రైనేజీ, వీధిలైట్లు, అంతర్గత రోడ్లు తదితర స్థానిక సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తున్న సిపిఎం పార్టీ అభ్యర్థులను రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా పట్టణ కార్యదర్శి  చింతనిప్పు చలపతిరావు, నాయకులు గుడిమెట్ల రజిత, షేక్ నాగుల్ పాషా, తోట కృష్ణవేణి,  కంసాని మల్లికాంబ, భూక్యా విజయ, మాడపాటి సుజాత, పారుపల్లి చంద్రశేఖర్ బాబు, మందడపు రామారావు, బండారు రామారావు, సంక్రాంతి భాస్కరరావు, మాదినేని శ్రీనివాసరావు, మాడపాటి వెంకటేశ్వరరావు, మాడపాటి రామారావు, దోసపాటి పుల్లయ్య, పూనాటి సూరయ్య తదితరులు పాల్గొన్నారు.

Image 1

సింగర్ మంగ్లీపై కేసు నమోదు

Posted On 2026-04-11 11:02:54

Readmore >
Image 1

కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు

Posted On 2026-04-11 10:47:57

Readmore >
Image 1

సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు

Posted On 2026-04-11 08:51:32

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎస్బిఐ ఎటిఎం మిషన్ మాయం

Posted On 2026-04-11 08:33:02

Readmore >
Image 1

గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు

Posted On 2026-04-10 21:55:23

Readmore >
Image 1

సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు

Posted On 2026-04-10 21:17:45

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు

Posted On 2026-04-10 21:16:25

Readmore >
Image 1

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు

Posted On 2026-04-10 20:50:16

Readmore >
Image 1

బొత్స తో తెలుగుశక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ భేటీ

Posted On 2026-04-10 20:49:00

Readmore >
Image 1

పీజీ ఫలితాలు విడుదల

Posted On 2026-04-10 20:44:45

Readmore >