| Daily భారత్
Logo




ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

News

Posted on 2026-01-11 20:34:46

Share: Share


ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: ఇందల్వాయి మండలం లోని జ్ఞాన వాగ్దేవి విద్యాలయంలో  2011-12 విద్యా సంవత్సరానికి పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల యాజమాన్యం తో పాటు తమకువిద్యనుబోధించిన ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులను ఆహ్వానించి సన్మానించారు.పూర్వ విద్యార్థులు ఆటపాటలలో తమ ప్రతిభ కనబరచి పండగ వాతావరణాన్ని  తలపించారు.వివిధ రకాల ఆటల్ని ఉపాధ్యాయులతో ఆడించారు. గత 13 సంత్సరాల క్రితం పంచుకున్న తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తమ దగ్గర చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానం లో ఉన్నందుకు ఉపాధ్యా యులు గర్వపడుతూ, ఆనందం  వ్యక్తం చేశారు. పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ తమ  పాఠశాల లో చదివిన విద్యార్థులు గొప్ప స్థాయిలో ఉన్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. విద్య నేర్పిన గురువులతో ఆట పాటలతో గడిపే అవకాశం మళ్ళీ వచ్చినందుకు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తు కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం ఆర్. రాధిక, టి. గంగాధర్, ప్రధానోపాధ్యాయులు బి. ఓంకారా చారి, వైస్ ప్రిన్సిపాల్  ఎం. ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, బలవంత్ రావు, పాషా, పోశెట్టి, శంకర్, నరేష్, దుబ్బాక ప్రవీణ్, పాండు,భూమేష్, శ్రీధర్,రమాదేవి, అరుణ, తదితరులు, పూర్వ విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.

Image 1

సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు

Posted On 2026-04-11 08:51:32

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎస్బిఐ ఎటిఎం మిషన్ మాయం

Posted On 2026-04-11 08:33:02

Readmore >
Image 1

గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు

Posted On 2026-04-10 21:55:23

Readmore >
Image 1

సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు

Posted On 2026-04-10 21:17:45

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు

Posted On 2026-04-10 21:16:25

Readmore >
Image 1

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు

Posted On 2026-04-10 20:50:16

Readmore >
Image 1

బొత్స తో తెలుగుశక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ భేటీ

Posted On 2026-04-10 20:49:00

Readmore >
Image 1

పీజీ ఫలితాలు విడుదల

Posted On 2026-04-10 20:44:45

Readmore >
Image 1

బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-04-10 20:41:31

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ

Posted On 2026-04-10 20:39:34

Readmore >