Posted on 2026-01-10 11:09:31
పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించాలి
కార్పొరేషన్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం కార్పొరేషన్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించాలని మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి కమిషనర్ సుజాతను కోరారు. కమిషనర్ ను కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతినెల 4వ తేదీ లోపు పారిశుద్ధ్య కార్మికులకు గౌరవ వేతనం చెల్లించాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వంలో పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నప్పుడు నాల్గవ తేదీ లోపు వేతనాలు చెల్లించామని గుర్తు చేశారు. సంక్రాంతి పండుగ, సమ్మక్క సారక్క జాతర ఉన్న నేపథ్యంలో కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలని కోరారు. పదవ తేదీ వచ్చిన పట్టణంలోని పారిశుద్ధ్య కార్మికులకు నేటికీ గౌరవ వేతనం అందలేదని విమర్శించారు. తద్వారా పారిశుద్ధ్య కార్మికులు పనులు మానేయడంతో కొత్తగూడెం కార్పొరేషన్ మురికి కూపంగా మారుతుందని తెలిపారు. కొత్తగూడెం పట్టణంలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలని స్పష్టం చేశారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >