| Daily భారత్
Logo




పోలీస్ వర్సెస్ ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో 43 పరుగులతో విజయం సాధించిన పోలీస్ టీం

Sports

Posted on 2026-01-09 12:10:03

Share: Share


పోలీస్ వర్సెస్ ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో 43 పరుగులతో విజయం సాధించిన పోలీస్ టీం

తన అద్భుతమైన బౌలింగ్ తో ప్రెస్ టీంకు సంబంధించి మూడు వికెట్లు పడగొట్టిన సిపి

ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించిన సిపి సాయి చైతన్య

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా పోలీస్ శాఖ నిర్వహించిన పోలీస్, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. మొదటగా పోలీస్ టీం టాస్ గెలిచి బ్యాటింగ్ చేయగా  132 ప్రత్యర్థి టీం అయిన ప్రెస్  టార్గెట్ విధించారు. 133 పరుగుల లక్ష్యంతో బరిలో ప్రెస్ లెవెన్ జట్టు 12 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి కేవలం 90 పరుగులు మాత్రమే చేసింది. పోలీస్ లెవెన్ జట్టు 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. పోలీస్ లెవెన్ జట్టులో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బౌలింగ్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి 3 ఓవర్లలో మూడు వికెట్లు తీసి పోలీస్ జట్టు విజయానికి దోహదపడ్డారు. అనంతరం మ్యాచ్ ముగిసిన తర్వాత జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ ముఖ్యఅతిథిగా హాజరై ఉత్తమ బ్యాట్స్మెన్, ఉత్తమ బౌలర్ కు బహుమానం అందించారు. పోలీస్ జట్టులో 96 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన ఎస్సై కిరణ్ కుమార్ బెస్ట్ బ్యాట్ మేన్ గా బహుమతి అందుకున్నారు. ప్రెస్ లెవెన్ నుండి ఉత్తమ బౌలర్గా శ్యామ్ నిలిచారు. ఇలాంటి ఫ్రెండ్లీ మ్యాచ్లు నిత్యం పోలీస్, ప్రెస్ వారు తమ తమ విధుల నిమిత్తం ఒత్తిడికి లోనవుతుంటారని ఇలాంటి ఫ్రెండ్లీ మ్యాచులు నిర్వహించుకోవడం మంచి సంప్రదాయమని వక్తలు పేర్కొన్నారు. అనంతరం ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ను తిలకించడానికి వచ్చిన ప్రెస్ అండ్ పోలీస్ మిత్రులకు మధ్యాహ్నం భోజన సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో డిసిపి అడ్మిన్ బసవరెడ్డి, ఏసిపి రాజా వెంకటరెడ్డి సిఐలు ఎస్సైలు పత్రికా ప్రతినిధులు పాల్గొన్నారు.

Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >
Image 1

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనర్

Posted On 2026-08-02 09:35:33

Readmore >
Image 1

స్వర్ణ కాంతుల్లో భారత వనితలు... రింగులో రికార్డుల పంట!

Posted On 2026-08-02 07:32:52

Readmore >
Image 1

సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్...

Posted On 2026-08-01 19:13:32

Readmore >
Image 1

నామినేటెడ్ పోస్టులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Posted On 2026-08-01 19:11:17

Readmore >
Image 1

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-08-01 18:43:13

Readmore >
Image 1

G.O 25 రద్దు చేయాలి, CPS రద్దు చేసి OPS అమలు చేయాలి: TPTF

Posted On 2026-08-01 16:59:26

Readmore >
Image 1

జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్

Posted On 2026-08-01 16:47:06

Readmore >
Image 1

సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన

Posted On 2026-08-01 15:52:51

Readmore >
Image 1

కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-01 15:46:07

Readmore >