| Daily భారత్
Logo




సుజాతనగర్ మండలంలో సంక్రాంతి సెలవుల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి

News

Posted on 2026-01-09 06:17:12

Share: Share


సుజాతనగర్ మండలంలో సంక్రాంతి సెలవుల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి

ఇండ్లకు తాళం వేసి వెళ్లే వారు తప్పనిసరిగా భద్రతా చర్యలు తీసుకోవాలి, పోలీసులకు తెలియపర్చాలి.

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంసంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా మండల ప్రజలు తమ స్వగ్రామాలకు, ఇతర పట్టణాలు మరియు దూర ప్రాంతాలకు ప్రయాణం చేయనున్న నేపథ్యంలో, ఇళ్లకు తాళం వేసి వెళ్లే సందర్భాల్లో దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మండల  ప్రజలకు సుజాతనగర్ పోలీస్ వారి తరుపున  విజ్ఞప్తి చేస్తునాము.

సంక్రాంతి పండుగలను దృష్టిలో ఉంచుకుని మండల  వ్యాప్తంగా 24 గంటల పాటు నిరంతర పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాము.

దొంగతనాల నివారణకు పోలీస్ శాఖ ప్రజలకు ఈ క్రింది సూచనలు చేస్తోంది

• ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు తలుపులు, కిటికీలు సరిగా మూసివేశామా లేదా అని నిర్ధారించుకోవాలి.

• బంగారు, వెండి ఆభరణాలు, నగదు, ముఖ్యమైన పత్రాలను ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్‌లో లేదా విశ్వసనీయ వ్యక్తుల వద్ద భద్రపరచుకోవాలి.

• ఇల్లు ఖాళీగా ఉందని అనుమానం రాకుండా టైమర్ లైట్లు ఏర్పాటు చేయాలి లేదా రాత్రివేళ కనీసం ఒక గదిలో లైట్ వెలిగేలా చూడాలి.

• ఇంటి ముందు పత్రికలు, పాలు, పార్సెల్స్ పేరుకుపోకుండా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి.

• సీసీటీవీ కెమెరాలు, అలారం సిస్టమ్స్ ఏర్పాటు చేయడం ద్వారా భద్రత మరింత మెరుగుపడుతుంది.

• సోషల్ మీడియాలో “ఊరికి వెళ్లాం”, “ఇంట్లో లేను” వంటి వివరాలను బహిరంగంగా పోస్ట్ చేయడం నివారించాలి.

• పొరుగువారితో సమన్వయం కలిగి పరస్పరంగా ఇళ్లపై నిఘా ఉంచుకునేలా సహకరించాలి.

• తాళాలను తలుపుల దగ్గర, పూల కుండీలలో లేదా మ్యాట్స్ కింద దాచిపెట్టకూడదు.

• పనిమనుషులు, డ్రైవర్లు, అపరిచితుల వివరాలను సరిగా పరిశీలించి మాత్రమే ఇంట్లోకి అనుమతించాలి.

• ఇంటి చుట్టూ ఉన్న పొదలు, చెట్లు కత్తిరించి స్పష్టమైన విజిబిలిటీ ఉండేలా చూడాలి.

• మెయిన్ గేట్ లేదా ఇంటి ముందు సెన్సార్ లైట్లు ఏర్పాటు చేయడం ద్వారా అనవసర ప్రవేశాలను అడ్డుకోవచ్చు.

• ఇంటి ముందు లేదా ఇంట్లోకి వెళ్లే దారుల్లో వాహనాలను ఎక్కువ రోజులు నిలిపి ఉంచకుండా జాగ్రత్త పడాలి.

• బంగారం కొనుగోలు, పండుగ షాపింగ్ వివరాలను బహిరంగంగా ప్రచారం చేయకుండా ఉండాలి.

• ఇంట్లో పనిచేసే వారి వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్‌లో వెరిఫికేషన్ చేయించుకోవాలి.

• ప్రయాణానికి ముందు ఇంటి ఫోటోలు, విలువైన వస్తువుల వివరాలను భద్రంగా నమోదు చేసుకుని ఉంచుకోవడం మంచిది.

• అపార్ట్మెంట్లు, కాలనీల్లో వాచ్‌మన్‌లను అప్రమత్తం చేసి గేట్లు సరిగా మూసేలా చూడాలి.

• అద్దె ఇళ్ల యజమానులు ఖాళీగా ఉన్న ఇళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి.

• ఇంటి బయట గేటుకు ఎక్కువ రోజుల పాటు తాళం వేస్తే ఇంట్లో ఎవరూ లేరనే అనుమానం దొంగలకు కలగవచ్చునని గుర్తుంచుకోవాలి.

ప్రజలు పోలీస్ శాఖకు పూర్తిస్థాయిలో సహకరించాలని, ఏదైనా అనుమానాస్పద సమాచారం గమనించిన వెంటనే డయల్ 100 లేదా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరుతున్నాము.

ప్రతి ఒక్కరూ పై సూచనలు పాటిస్తూ, పోలీస్ యంత్రాంగానికి సహకరించాలని కోరుతున్నాము. సుజాతనగర్ ఎస్సై రమాదేవి తెలియజేసినారు

Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >