Posted on 2026-01-06 10:22:08
నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని పోరాడుతాం
సావిత్రిబాయి స్ఫూర్తితో శాస్త్రియ విద్యా విధానం కోసం ఉద్యమిస్తాం
ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయండి
హైదరాబాదులో జనవరి 25 నుంచి 28 వరకు జాతీయ మహాసభలు
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ యం.మమత
డైలీ భారత్, వైరా:భారత దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో నూతన విద్యా విధానం - 2020 పేరుతో విద్యారంగంపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా శాస్త్రియ విద్యా విధానం కోసం ఉద్యమించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ యం.మమత పిలుపునిచ్చారు. నూతన విద్యా విధానం పేరుతో విద్యారంగంపై జరుగుతున్న దాడిని అరికట్టాలని, పేద కుటుంబాల విద్యార్థులు చదువు కోనుక్కోని చదువుకోలేరని, కులవృత్తులు చేసుకుని బ్రతకాల్సిన పరిస్థితులు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఐద్వా వైరా డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభల సందర్భంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో "నూతన విద్యా విధానం - నేటి సవాళ్లు" అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రి భాయి పూలే చిత్రపటానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎల్.నవీన జ్యోతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఐద్వా వైరా డివిజన్ నాయకురాలు మచ్చా మణి అధ్యక్షతన జరిగిన సెమినార్ లో యం.మమత మాట్లాడుతూ నూతన విద్యా విధానం - 2020 పేరుతో జరుగుతున్న విద్యా ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నాడు మనువాదం, మూఢాచారాలకు వ్యతిరేకంగా సావిత్రిబాయి పూలే పోరాటం సాగించారని, మహిళల చదువు కోసం, సమానత్వం కోసం, హక్కుల కోసం సావిత్రి భాయి పూలే జీవితాంతం కృషి చేశారని గుర్తు చేశారు. మహిళల జీవితాల్లో విప్లవాత్మక మార్పుల కోసం ఆమె తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసి పోరాడిన విధానం నేటి మహిళలందరికీ ఆదర్శనీయం అన్నారు. నూతన విద్యా విధానం పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్నారని, కళాశాలల ఫీజులు భారీగా పెంచుతున్నారని తెలిపారు. దీనివలన ప్రభుత్వ విద్యా రంగం, బాలికల విద్య ప్రమాదంలో పడుతుందని, ఇటువంటి చర్యలతో సమాజంలో మహిళల విద్యాభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. ఐద్వా లక్ష్యాలైన స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, సమానత్వం, మహిళా విముక్తి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. మహిళలంతా సమిష్టిగా పోరాడి హక్కులు సాధించుకోవాలని సూచించారు. హైదరాబాదులో జరిగే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని యం.మమత పిలుపునిచ్చారు. జనవరి 25న హైదరాబాద్ లోని ఎన్టీఆర్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ మహాసభలు సామ్రాజ్యవాదాన్ని ఎదిరించండి - మనువాదాన్ని ఓడించండి – మహిళా హక్కులను కాపాడండి అనే నినాదంతో సాగుతాయని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జరిగే ఐద్వా జాతీయ మహాసభలు, బహిరంగ సభకు మహిళలు పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.ప్రవీన్, ఐద్వా డివిజన్ సహాయ కార్యదర్శి తోట కృష్ణవేణి, ప్రభుత్వ జూనియర్ కళాశాల స్టాప్, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >
తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
Posted On 2026-08-06 18:26:12
Readmore >
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >