| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయండి : బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయండి : బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

డైలీ భారత్, ఖమ్మం:భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జనవరి 7వ తేది బుధవారం ఉదయం 10:00 గం:లకు ఖమ్మం జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు  మంగళవారం జూలూరుపాడు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ఈ పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులకు (సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు) ఆత్మీయ అభినందనసభ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈసభలో ముఖ్యఅతిథిగా కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పాల్గొని గ్రామ ప్రజాప్రతినిధులను శాలువాతో సత్కరించి, అభినందిస్తారన్నారు.

ఈ సభకు వైరా నియోజకవర్గ పరిధిలోని. మండల అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు ఎంపీటీసీలు మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయవలసిందిగా గిరిబాబు కోరారు.

Previous ప్రమాదం అంచున ఎన్ఎస్పీ బ్రిడ్జ్
Next పేద విద్యార్థులు చదువుకోలేరు... చదువు కోనుక్కోవాలి : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ యం.మమత
ADVERTISEMENT