| Daily భారత్
Logo




కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

News

Posted on 2026-08-05 13:09:21

Share: Share


కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

కామారెడ్డి, డైలీ భారత్: జిల్లాలో సంచలనం సృష్టించిన ఆన్‌లైన్ బెట్టింగ్/గేమింగ్ మోసం కేసులో పోలీసులు మరో కీలక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

31-07-2026న రామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపగా, పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

కామారెడ్డి డీఎస్పీ పర్యవేక్షణలో బృందాలు సాంకేతిక, డిజిటల్ ఆధారాలతో పాటు నిఘా సమాచారాన్ని ఆధారంగా చేసుకుని అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం వెల్లంకి గ్రామానికి చెందిన ముత్యాల నాయుడు @ రొంగలి ముత్యాలు నాయుడు, వయసు 36, ను అరెస్ట్ చేశారు.

మోసం చేసిన తీరు:

నిందితుడు SAT Sports మరియు http://Future9(dot)com అనే వెబ్‌సైట్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. వాట్సాప్‌లో లింకులు పంపి పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు ఇస్తామని ప్రజలను నమ్మించాడు. బాధితుల పేర్లతో యూజర్ ఐడీలు క్రియేట్ చేసి, UPI, బ్యాంకు ఖాతాలు, QR కోడ్‌ల ద్వారా డబ్బు వసూలు చేశాడు.

పోలీసులు నిందితుడి నుంచి ఒక Apple iPhone ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్‌లో బెట్టింగ్ వెబ్‌సైట్లకు సంబంధించిన ముఖ్యమైన డిజిటల్ ఆధారాలు ఉన్నట్లు గుర్తించారు.

ఈ ముఠాలో ఇంకా ఉన్న వారి గురించి, బ్యాంకు లావాదేవీలు, డిజిటల్ పరికరాలపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. త్వరలో మిగిలిన నిందితులను కూడా అరెస్ట్ చేస్తామన్నారు.

Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >