| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కార్మికులు జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి : సైకాలజిస్ట్ పున్నంచందర్

కార్మికులు జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి : సైకాలజిస్ట్ పున్నంచందర్

సిరిసిల్ల, డైలీ భారత్: ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్, ప్రభుత్వ సాధారణ వైద్యశాల ఆధ్వర్యంలో వెంకట్రావ్ నగర్‌లోని పవర్‌లూమ్ కార్మికులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కౌన్సెలింగ్ నిర్వహించారు.

ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ కార్మికులకు కౌన్సెలింగ్ ఇస్తూ... కార్మికులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పని ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, పౌష్టికాహార లోపాలు, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి అలవాట్లు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలిపారు.

మద్యానికి దూరంగా ఉండాలి:

పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి మద్యపానాన్ని ఆశ్రయించడం సరైన పద్ధతి కాదని, అది క్రమంగా వ్యసనంగా మారి కుటుంబ సంబంధాలు, ఆర్థిక పరిస్థితులు, శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. మద్యపాన అలవాటు ఉన్నవారు మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ సహాయం తీసుకోవాలని సూచించారు.

నిద్ర సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు:

ప్రతిరోజూ తగినంత నిద్ర మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో అవసరమని, నిద్రలేమి, తరచుగా మెలకువ రావడం, పగటిపూట అలసట వంటి సమస్యలు నిరంతరం వేధిస్తే వైద్యుల సలహా తీసుకోవాలని సూచించారు.

మానసిక ఒత్తిడిని అధిగమించే మార్గాలు:

ప్రతిరోజూ కొంత సమయం విశ్రాంతికి కేటాయించాలని, క్రమం తప్పకుండా నడక, వ్యాయామం చేయాలని, కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడాలని తెలిపారు. ఆందోళన, నిరాశ, చిరాకు, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు ఎక్కువకాలం కొనసాగితే మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించాలని సూచించారు.

మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ ద్వారా మానసిక ఒత్తిడి, నిద్ర సమస్యలు, మద్యపాన వ్యసనం, ఆందోళన, నిరాశ, కుటుంబ సమస్యలపై వ్యక్తిగత, కుటుంబ కౌన్సెలింగ్ అందిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ సిబ్బంది రాపెల్లి లత, కొండ ఉమ, బూర శ్రీమతి పాల్గొన్నారు.

#Sircilla News, #World Mental Health Week, #Powerloom Workers Counseling, #Psychologist Punnanchander

Previous మెతుకుల మౌనంలో మానవత్వపు రాగం—మంజుల పత్తిపాటి
ADVERTISEMENT