హైదరాబాద్, డైలీ భారత్: హైదరాబాద్లో TGSPDCL అసిస్టెంట్ ఇంజనీర్ ఏసీబీ వలలో చిక్కాడు. సంతోష్ నగర్ సబ్ డివిజన్, మదన్నపేట సెక్షన్లో పనిచేస్తున్న ఏఈ పండాల సంధ్యా రాకేశ్ రూ.1,20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
ఫిర్యాదుదారుడి ఆన్లైన్ దరఖాస్తులను ఆమోదించి, పాత మీటర్లు పోయిన చోట ఆరు కొత్త విద్యుత్ మీటర్లు మంజూరు చేసేందుకు రూ.1.20 లక్షలు డిమాండ్ చేసి తీసుకుంటుండగా సిటీ రేంజ్-2 ఏసీబీ అధికారులు 15.10.2026న పట్టుకున్నారు.
నిందితుడి వద్ద నుండి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తన విధిని సక్రమంగా నిర్వర్తించకుండా అక్రమ లాభం పొందేందుకు ప్రయత్నించాడని ఏసీబీ తెలిపింది.
నిందితుడిని SPE & ACB కేసుల ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి, నాంపల్లి ముందు హాజరుపర్చి రిమాండ్కు తరలించనున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
ప్రజలకు ఏసీబీ విజ్ఞప్తి: ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలని, వాట్సాప్ 9440446106, ఫేస్బుక్ (Telangana ACB), X (@Telangana ACB) ద్వారా సంప్రదించాలని ఏసీబీ కోరింది. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
#Hyderabad ACB Trap, #TGSPDCL AE Bribe Case, #Telangana ACB News