| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రమాదం అంచున ఎన్ఎస్పీ బ్రిడ్జ్

ప్రమాదం అంచున ఎన్ఎస్పీ బ్రిడ్జ్

డైలీ భారత్, హుజూర్ నగర్: హుజూర్ నగర్  నుండి మేళ్లచెర్వు వెళ్లే ప్రధాన రహదారిపై వేపల సింగారం గ్రామ శివారులో ఉన్న ఎన్ఎస్పీ బ్రిడ్జ్ ప్రమాదం అంచున ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ బ్రిడ్జ్ పైన రంధ్రం ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ బ్రిడ్జి పైన అధిక లోడ్ కలిగిన భారీ వాహనాల రాకపోకల కారణంగానే రంధ్రం ఏర్పడిట్లు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రాథమికంగా నిర్మాణ లోపాలు లేదా ఇటీవలి వర్షాల ప్రభావం  కారణంగానే బ్రిడ్జికి రంధ్రం పడినట్లు అధికారులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ మార్గంలో వెళ్లే  రోజువారీ ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున ప్రమాదకరంగా ఉన్న బ్రిడ్జ్ పనులు త్వరితగతిన మరమ్మతులు చేపట్టి ఈ బ్రిడ్జిపైన రాకపోకలను  పునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Previous తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
Next కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయండి : బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
ADVERTISEMENT