| Daily భారత్
Logo




వెల్నెస్ సెంటర్లో డాక్టర్లు లెస్

News

Posted on 2026-01-06 14:06:08

Share: Share


వెల్నెస్ సెంటర్లో డాక్టర్లు లెస్

పీజీ మెడికో లతో వంతుల వారిగా వైద్యం

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్:  ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పాత్రికేయుల కోసం రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కేంద్రంలో వెల్నెస్ సెంటర్ ను ఏర్పాటు చేసి అందులో ఎంబిబిఎస్ వైద్యులను ప్రభుత్వం నియమించి ఓపి వైద్య సేవలను అందించడానికి వెల్నెస్ సెంటర్ కేంద్రం ప్రభుత్వ, రిటైర్డ్, పాత్రికేయుల కోసం ఈ సెంటర్ ను ఏర్పాటు చేయగా ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వెల్నెస్ సెంటర్లో పూర్తిస్థాయి వైద్యులు లేకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు, పాత్రికేయులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కాగా నిజామాబాద్ వెల్నెస్ సెంటర్ లో విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. పూర్తిస్థాయి డాక్టర్లు లేకపోవడంతో చేసేదేమీ లేక వెల్నెస్ సెంటర్ ఇన్చార్జ్ అధికారిని పీజీ చదివే మెడికల్ విద్యార్థులతో వంతుల వారీగా రోజుకో మెడికల్ పీజీ స్టూడెంట్ ను రప్పించి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు, పాత్రికేయులకు కేవలం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓపి సేవలు అందిస్తున్నారు. వాస్తవానికి ముగ్గురు ఎంబిబిఎస్ వైద్యులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఒక్క ఎంబిబిఎస్ వైద్యుడు కూడా సదరు వెల్నెస్ సెంటర్లో అందుబాటులో లేకపోవడం గమనార్హం. అందులో ఇదివరకు విధులు నిర్వహించిన ఎంబిబిఎస్ డాక్టర్లు రాజీనామా చేసి వేరే చోటికి వెళ్లినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.  మధ్యాహ్నం నుండి వైద్యం చూపించడానికి వచ్చే రోగులకు వెల్నెస్ సెంటర్లో డాక్టర్లు లేకపోవడంతో తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇక మధ్యాహ్నం నుంచి కాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. అందులో పని చేసే ఉద్యోగులు సైతం ఫోన్లో కాలక్షేపాలు చేస్తూ విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వెల్నెస్ సెంటర్లో పూర్తిస్థాయిలో విధులు నిర్వహించే డాక్టర్ను నియమించాలని రిటైర్డ్ ఉద్యోగులు, పాత్రికేయులు కోరుతున్నారు.


Image 1

"ప్రాణాలు కాపాడండి" అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు...

Posted On 2026-08-07 12:34:53

Readmore >
Image 1

హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి

Posted On 2026-08-07 12:07:52

Readmore >
Image 1

భర్తను చంపేందుకు భార్య, ప్రియుడి కుట్ర...

Posted On 2026-08-07 11:48:51

Readmore >
Image 1

నేతన్న నెత్తుటి నూలు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-07 06:40:06

Readmore >
Image 1

తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-06 18:26:12

Readmore >
Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >