| Daily భారత్
Logo




వెల్మల్ గ్రామంలో ప్రత్యేకంగా పి ఎస్ సి ఎస్ సొసైటీని ఏర్పాటు చేయాలి

News

Posted on 2026-01-05 11:54:56

Share: Share


వెల్మల్ గ్రామంలో ప్రత్యేకంగా పి ఎస్ సి ఎస్ సొసైటీని ఏర్పాటు చేయాలి

కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేసిన గ్రామస్తులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో ప్రత్యేకంగా ప్రాథమిక సహకార సంఘం ఏర్పాటు చేయాలని గ్రామ సర్పంచ్ దేవేందర్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగిన ప్రజావాణిలో గ్రామ సర్పంచ్ తోపాటు గ్రామ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ డిమాండ్ ను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ వెల్మల్ గ్రామానికి సంబంధించిన రెవెన్యూ శివారులో నాలుగు ఎకరాల 100 గజాల స్థలం ఉందని, అందులో పిఎసిఎస్ లో తమ గ్రామం నుండి 13 వరకు సభ్యత్వం ఉందని ఆయన అన్నారు. అయితే రెండు సీజన్లకు కలిపి ఒక లక్ష క్వింటాళ్ల ధాన్యాన్ని తమ గ్రామా రైతులు పండిస్తారని ఆయన తెలిపారు. అయితే తమకు చెందిన నూతన సొసైటీని నందిపేట్ లో ఏర్పాటు చేసి వెల్మల్ గ్రామాన్ని అందులో కలిపే కుట్రలు జరుగుతున్నాయని తమ గ్రామస్తుల దృష్టికి వచ్చిందన్నారు. నందిపేట్ లో తమకు చెందిన సొసైటీ ఏర్పాటుకు తాము ఎలాంటి వ్యతిరేకము కాదని కానీ మమ్మల్ని అందులో విలీనం చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. రెవిన్యూ పరంగా జిల్లాలోనే ధాన్యం పండించడంలో రెండవ స్థానంలో తమ గ్రామం ఉందని ఆయన అన్నారు. కావున జిల్లా అధికారులు అధికార పార్టీ నేతలు తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని తమ గ్రామంలో ప్రత్యేకంగా పి ఎస్ సి ఎస్ ఏర్పాటు చేయాలని గ్రామ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగిందన్నారు. లేనియెడల రాబోయే ఎన్నికలను వెల్మల్ గ్రామ ప్రజలు పూర్తిగా బహిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు. కావున తమ గ్రామానికి ప్రత్యేకంగా పిఎసిఎస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఇస్సపల్లి మహేష్, మాజీ సర్పంచ్ మచ్చర్ల గంగారం, నాయకులు కస్ప రామకృష్ణ, రాము, జి ఆర్ రాజేందర్, మల్లేష్, శ్రీధర్, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >
Image 1

రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్

Posted On 2026-08-08 14:28:17

Readmore >
Image 1

రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

Posted On 2026-08-08 07:38:13

Readmore >
Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >
Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >