Posted on 2025-12-24 20:06:00
అనిసా అధికారుల సోదాలలో బట్టబయలైన 200 కోట్ల ఆస్తులు, మూడు కిలోల బంగారం..
బ్యాంక్ లాకరులో మరో కిలోన్నర బంగారం...
అజ్ఞాతంలోకి వెళ్లిన డిటిసి కిషన్ నాయక్ డ్రైవర్..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:జిల్లాకు చెందిన డీటీసీ కిషన్ నాయక్ ఇంటిపై మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో డిటిసి అక్రమస్తులు భారీగా బయటపడటంతో అధికారులను విస్మయానికి గురిచేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లాలో పనిచేస్తున్న రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని ఆర్ఆర్‌నగర్‌లోగల ఆయన నివాసంతోపాటు దాదాపు 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో 200 కోట్ల ఆస్తులతో పాటు మూడు కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు ముందే పసిగట్టిన డీటీసీ కిషన్ నాయక్ తన డ్రైవర్ శివ శంకర్ ద్వారా భారీగా అక్రమస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ తో పాటు, భారీగా నగదు తరలించినట్లు తెలిసింది. ప్రస్తుతం శివశంకర్ అజ్ఞాతంలో ఉండడంతో అతని కొరకు ఏసీబీ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అతను పట్టుబడితే మరిన్ని భారీ ఆస్తులు, నగదు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ను పరిశీలించగా వాటి విలువ బహిరంగ మార్కెట్‌లో దాదాపు 200 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. పెట్రోల్ బంక్‌లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, హోటళ్లు, స్థిర, చరాస్తులతో పాటు, బ్యాంక్ లాకర్లలో కిలోన్నర బంగారం గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. కిషన్ నాయక్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.ఏసీబీ అధికారులు 15 బృందాలుకు పైగా ఏర్పడి మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్‌లలో సోదాలు నిర్వహించారు. నిజామాబాద్‌లో లహరి ఇంటర్నేషనల్ హోటల్, రాయల్ ఓక్ బిల్డింగ్, పది ఎకరాల పొలం కిషన్ నాయక్‌కు చెందినవిగా గుర్తించారు.మెదక్,నారాయణ్ ఖేడ్ లలో అక్రమ ఆస్తులు గుర్తించి వాటి డాక్యుమెంట్ స్వాధీనం చేసుకున్నారు.
వీటితో పాటు కిషన్ నాయక్ స్నేహితుల ఇండ్లలో అక్రమ ఆస్తుల డాక్యుమెంట్లు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. డీటీసీ కిషన్ నాయక్ అక్రమస్తుల పుట్ట తప్పిన కొద్ది బయట పడుతుంది. అతని అక్రమస్తులను చూసి సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులే ఆశ్చర్యపోతున్నారు. రెండవ రోజు కూడా వివిధ ప్రాంతాలలో సోదాలు కొనసాగుతున్నాయి.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >