Posted on 2025-12-24 20:07:01
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తెలంగాణ రాష్ట్ర వనరులపైన అవగాహనలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలో ఉండటం రాష్ట్రాభివృద్ధికి అవరోదమేనని నిజామాబాద్ జిల్లా భారాస లీగల్ సెల్ కన్వీనర్ దాదన్నగారి మధుసుధన్ రావు అన్నారు. కేసీఆర్ సందించిన ప్రశ్నలకు జవాబులు చెప్పలేక తికమకపడి తప్పుడు మాటలు మాట్లాడటం ముఖ్యమంత్రి హోదాకు తగదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ వేసిన ప్రగతి గీతికలు రేవంత్ పాలనలో నీటిమీద రాతలు అవుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణ జల వనరులు మళ్ళీ ఆంధ్రపాలకుల పరం చేస్తున్న దానికి రేవంత్ సమాధానం ఇవ్వకుండా బజారు భాషలో కేసీఆర్ పై నోరు జారడం తెలితక్కున తనమేనని ఆయన తెలిపారు. గోదావరి, కృష్ణ నదుల నీటిని ఒడిసిపట్టి పంట పొలాలకు మల్లించిన కేసీఆర్ కు రేవంత్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నదని అన్నారు. తెలంగాణ పై చిత్తశుద్ధి ఉన్న కేసీఆర్ ను ఎదుర్కొనే దమ్ములేక గాలి మాటలు మాట్లాడడం రేవంత్ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం మానుకోవలన్నారు. కేసీఆర్ అనే ఆకాశంపై ఉమ్మివేస్తే, ఆ ఉమ్ము రేవంత్ రెడ్డి పైనే పడుతుందనే నానుడి రేపటి నాడు నిజం అవుతుందని ఆయన తెలిపారు.
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >