Posted on 2025-12-11 19:14:34
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:జిల్లా కేంద్రంలోని స్థానిక ఖలీల్వాడి లో డాక్టర్ విశాల్ ఆకుల పిల్లల మనోవికాస నూతన భవన ప్రారంభోత్సవం ఏర్పాటు చేసినట్లు ప్రముఖ న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ విశాల్ ఆకుల తెలిపారు. ఈ నూతన భవన కార్యక్రమ ప్రారంభానికై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఐపీఎస్ సాయి చైతన్య హాజరై నూతన భవనాన్ని ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా నేటి రోజులలో పిల్లలలో నేటి టెక్నాలజీ యుగంలో అనేక రకాలుగా బుద్ధి మాంద్యం మరియు ఆలోచనా సరళి నడుచుకునే విధానంలో సమస్యలు ఎదుర్కొంటున్నారని ఇటువంటి వారి కోరకై ప్రముఖ పట్టణాలలో ఏర్పాటు చేసేటువంటి ఈ మనోవికాస కేంద్రం ని నిజామాబాద్ లో డాక్టర్ విశాల్ ఆకుల ప్రారంభించడం అభినందనీయమని కొనియాడారు.
అనంతరం సీ పి కి ఆస్పత్రి తరపున మెమెంటో శాలువాతో ఘనంగా సన్మానించారు తదాంతరం ఆస్పత్రిలోని వివిధ విభాగాలను డాక్టర్. ఈ. రవీంద్రారెడ్డి, డాక్టర్ టి జీవన్ రావు, డాక్టర్ వై శ్రీధర్ రాజు, డాక్టర్ వి జార్జి రెడ్డి, డాక్టర్ అజ్జ శ్రీనివాస్, డాక్టర్ హరీష్ స్వామి, డాక్టర్ రమేనేశ్వర్,డా. కప్పల రాజేష్ అడ్వకేట్ ఆర్ జగదీశ్వరరావు, ఎం సిద్దయ్య, డాక్టర్ కే రాజేష్, డాక్టర్ పి . బి. కృష్ణమూర్తి, డాక్టర్ కౌలయ్య తదితరులు ప్రారంభించారు. కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ వైద్యులు, ఇతరాత్ర సంస్థల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై డాక్టర్ విశాల్ ఆకుల కి అభినందనలు తెలపారు. కార్యక్రమంలో వారి సతీమణి డాక్టర్ నాగ పద్మ, వారి కుటుంబ సభ్యులు ఆస్పత్రి సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మహిళల భద్రతే లక్ష్యం – ప్రజల్లో చైతన్యం నింపుతున్న కామారెడ్డి షీ టీమ్
Posted On 2026-06-07 13:06:00
Readmore >
ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా “ఫిట్ ఇండియా మూవ్‌మెంట్” సైక్లింగ్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-07 13:04:42
Readmore >
రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-06-06 22:16:35
Readmore >
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >