Posted on 2025-12-09 18:52:36
ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి విడత ఎన్నికలు బోధన్ డివిజన్ పరిదిలో జరగనున్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య బోధన్ సర్కిల్ కార్యాలయంలో సంబంధిత పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని తూ.చా తప్పకుండా పాటించాలని తెలియజేశారు. ప్రధానంగా
బోధన్ డివిజన్ పరిధిలో గల సమస్యత్మకమైన, అతిసమస్యత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్లను గుర్తించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతీ పోలింగ్ కేంద్రానికి నిర్దిష్ట దూరంలో మార్కింగ్ చేయించి , ప్రచారం , గుర్తులను ప్రదర్శించడం నివారించాలని అన్నారు. అవసరాన్ని బట్టి స్ట్రైకింగ్ ఫోర్స్ సేవలను వినియోగించుకొని గుంపులను చెదర గొట్టాలని అన్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే డబ్బు, మద్యం, మరే ఇతరములు అక్రమ రవాణా జరగడానికి విలులేకుండా అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. విలేజ్ పోలీసు అధికారులు (విపిఓ)ఆయా గ్రామలపై నిఘా ఉంచి, ముందస్తు సమాచారాన్ని సేకరించి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎన్నికల రోజు సిబ్బంది తెల్లవారుజామునే తమకు కేటాయించిన పోలింగ్ బూతు వద్ద సక్రమమైన విధులు నిర్వహించాలని , ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొత్తము పూర్తి అయ్యేవరకు ఎవరు ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దని, ఎన్నికల నియమావళిని తూ.చా తప్పకుండా పాటించే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని విధినిర్వహణలో ఎలాంటి లోపాలు ఉన్న అట్టి సిబ్బందిపై తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా బోధన్ ఏ.సి.పి శ్రీనివాస్, బోధన్ రూరల్ సీ.ఐ విజయబాబు, బోధన్ ఎస్హెచ్ఓ వెంకట్ నారాయణ, నిజామాబాద్ నార్త్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి . శ్రీనివాస్, రుద్రూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ, బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి , ఎడపల్లి ఎస్సై రమ, రెంజల్ ఎస్సై చంద్రమోహన్, కోటగిరి ఎస్సై సునిల్, వర్ని ఎస్సై ఎస్.రాజు, రుద్రూర్ ఎస్సై సాయన్న తదితరులు పాల్గొన్నారు.
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >