సర్పంచ్ అభ్యర్థుల్లో నెలకొన్న టెన్షన్ వాతావరణం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్గురువారం ఉదయం 7 గంటల నుంచి అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ గ్రామపంచాయతీ జిల్లాలోని బోధన్ డివిజన్ ప్రాంతంలో జరగనున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్, ఎడపల్లి, సాలూర, నవీపేట్, రెంజల్, వర్ని, చందూర్, మోస్రా, కోటగిరి, పొతంగల్, రుద్రూర్ మండలాల్లోని 184 పంచాయతీలకు మొదటి విడతలో భాగంగా 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం గడువు నేటి సాయంత్రంతో ముగిసింది. దీంతో అభ్యర్థులు, వారి బంధువులు గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. తీవ్ర వాతావరణం నెలకొంది. ప్రతి ఓటరును కలుస్తూ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తించారు. ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగేందుకు ఇటు పోలీస్ యంత్రాంగం, సర్వం సిద్ధం చేశారు.