| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అన్ని కులాల్లోని పేదలకూ రిజర్వేషన్లు దక్కాలి : ఈ నెల 24న కామారెడ్డిలో భారీ బహిరంగ సభ : కరుణాకర్ రెడ్డి

అన్ని కులాల్లోని పేదలకూ రిజర్వేషన్లు దక్కాలి : ఈ నెల 24న కామారెడ్డిలో భారీ బహిరంగ సభ : కరుణాకర్ రెడ్డి

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ల సాధనే లక్ష్యం - 24న తెలంగాణలోకి రథయాత్ర

డైలీ భారత్, కామారెడ్డి / కీసర: అన్ని కులాల్లోని నిరుపేదలకూ రిజర్వేషన్లు దక్కాలని, ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా పోరాడుతున్నామని "ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల సాధన కమిటీ" స్టేట్ కోఆర్డినేటర్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

గురువారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర స్థాయి కమిటీ ప్రతినిధులు, వివిధ కుల సంఘాల నేతలు మాట్లాడారు.

స్వాతంత్ర్యం వచ్చి 8 దశాబ్దాలు అయినా...

స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు కావస్తున్నా అన్ని వర్గాల్లోని అట్టడుగు నిరుపేదలకు ప్రభుత్వ ఫలాలు, రిజర్వేషన్లు అందడం లేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కులమతాలకు అతీతంగా ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయడమే ప్రధాన ధ్యేయంగా పోరాడుతున్నామన్నారు.

24న తెలంగాణలోకి రథయాత్ర:

ప్రవీణ్ అరోరా నేతృత్వంలో ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద ప్రారంభమైన 20,000 కిలోమీటర్ల సుదీర్ఘ "ఆర్థిక రిజర్వేషన్ సాధన రథయాత్ర" ఈ నెల 24న నాగ్‌పూర్ మీదుగా ఆదిలాబాద్ వద్ద తెలంగాణలోకి ప్రవేశించనుందని రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఏనుగు సంతోష్ రెడ్డి తెలిపారు.

షెడ్యూల్ ఇదే:

- 24న నిర్మల్‌లో కార్నర్ మీటింగ్, కామారెడ్డిలో బహిరంగ సభ

- నిజామాబాద్, రామాయణపేట, తూప్రాన్ లలో కార్నర్ మీటింగ్ లు

- 25న హైదరాబాద్ అమరవీరుల స్థూపానికి నివాళి

- 26న జనగామ, వరంగల్ మీదుగా పరకాలలో 15 వేల మందితో భారీ బహిరంగ సభ

ప్రత్యేక రాజ్యాంగ కమిషన్ ఏర్పాటు చేయాలి:

కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒక ప్రత్యేక రాజ్యాంగ కమిషన్‌ను ఏర్పాటు చేసి చట్టబద్ధంగా ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లను అమలు చేయాలని కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. అట్టడుగున ఉన్న ప్రతీ పేదవానికి సంక్షేమ ఫలాలు అందే వరకు ఈ పోరాటం కొనసాగుతుందన్నారు.

ఈ సమావేశంలో పైళ్ల హరినాథ్ రెడ్డి, ఏనుగు సంతోష్ రెడ్డి, నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి, బుట్టంగారి మాధవ రెడ్డి, రాష్ట్ర పలు కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

 #EconomicReservation #RathYatra #Kamareddy #KarunakarReddy #Parakala #DailyBharat #Telangana

Previous ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన ఫారెస్ట్ అధికారి
ADVERTISEMENT