| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం

కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం

తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో మంగళవారం తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని జయజయహే తెలంగాణ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ లలో నూతనంగా నెలకొల్పిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రోడ్లు – భవనాల శాఖ కార్యనిర్వాహక అభియంత (ఎస్.ఈ) కె.సర్దార్ సింగ్ ఆవిష్కరించారు. రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన నమూనాను అనుసరిస్తూ జిల్లాలలో కూడా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఆకట్టుకునే రీతిలో, స్ఫూర్తిదాయకంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం అందరినీ ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Previous గ్రామపంచాయతీ ఎన్నికలు మొదటి విడత నిర్వహణలో భాగంగా బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సిపి
Next నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో అర్హత లేని ప్రిన్సిపాల్
ADVERTISEMENT