| Daily భారత్
Logo




తెలంగాణలో ఆర్టిఏ చెక్ పోస్టులు మూసివేత : బోర్డులు, బారికేడ్లు తొలగింపు

News

Posted on 2025-10-22 17:21:28

Share: Share


తెలంగాణలో ఆర్టిఏ  చెక్ పోస్టులు మూసివేత : బోర్డులు, బారికేడ్లు తొలగింపు

డైలీ భారత్, హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని రవాణా చెక్ పోస్టులను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 22న సాయంత్రం 5 గంటల లోపు మూసివేయాలని ఆ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. రెండు నెలల క్రితమే చెక్ పోస్టులను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నా కొనసాగించడంపై ఆర్టీఏపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు

ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ట్రాన్స్‌పోర్ట్ చెక్ పోస్టులు మూసివేయాలని రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు, జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. చెక్ పోస్టుల దగ్గర ఉన్న బోర్డులు, బారికేడ్లు, సిగ్నేజ్ తొలగించాలని ఆదేశించారు. సిబ్బందిని ఇతర శాఖలకు తిరిగి నియమించాలని.. చెక్ పోస్టుల దగ్గర ఎవరూ ఉండొద్దన్నారు.

చెక్ పోస్టుల దగ్గర వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని వెల్లడించారు. రికార్డులు, ఫర్నీచర్, పరికరాలు వెంటనే జిల్లా ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయానికి తరలించాలని తెలిపారు. ఆర్థిక, పరిపాలనా రికార్డులను సమన్వయం చేసి భద్రపరచాలని ఆదేశించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన ప్రకటనలు ఇవ్వాలని చెప్పారు. చెక్ పోస్టుల మూసివేతపై సమగ్ర నివేదిక అక్టోబర్ 22 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని చెప్పారు రవాణాశాఖ కమిషనర్....

Image 1

రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-04-13 22:31:22

Readmore >
Image 1

ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

Posted On 2026-04-13 21:33:35

Readmore >
Image 1

రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత

Posted On 2026-04-13 21:08:28

Readmore >
Image 1

విద్యుదాఘాతంతో బాలికకు తీవ్ర గాయాలు

Posted On 2026-04-13 20:45:38

Readmore >
Image 1

నిషేధిత ఆల్ప్రాజోలామ్ అక్రమ రవాణా భగ్నం – 101 గ్రాముల స్వాధీనం

Posted On 2026-04-13 20:40:46

Readmore >
Image 1

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్

Posted On 2026-04-13 20:38:38

Readmore >
Image 1

దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్య - మగువ

Posted On 2026-04-13 20:37:19

Readmore >
Image 1

దోస్త్ 2026 నోటిఫికేషన్ విడుదల..

Posted On 2026-04-13 20:04:47

Readmore >
Image 1

రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి

Posted On 2026-04-13 19:58:53

Readmore >
Image 1

ఒంటరి మహిళపై దాడి చేసి బంగారం దోపిడీ

Posted On 2026-04-13 19:14:12

Readmore >