Posted on 2025-10-22 17:10:02
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఇందల్వాయి మండలం వెంగల్ పాడ్, తాటితండా గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం విక్రయించుకునేలా అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి, ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని ఆయన తెలిపారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తుందని, నిజామాబాద్ జిల్లాలో గత ధాన్యం కొనుగోలు ఐకెపి ఆధ్వర్యంలో 100 సెంటర్ ఇస్తే, ప్రస్తుతం 200 ధాన్యం కొనుగోలు ఐకెపి కేంద్రాలకు అప్పజెప్పిందని అన్నారు. గత ధాన్యం కొనుగోలు ఐకెపి మహిళలకు కోటి రూపాయల లాభం వచ్చిందని అన్నారు, 200 ఐకెపి సెంటర్ల వల్ల ఐకెపి మహిళలకు సుమారు రెండు కోట్ల లాభం వస్తుందని అంచనా వేశారు. సిఎం రేవంత్ రెడ్డి మహిళలను కోటీశ్వర్లుగా చేయడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నారని అన్నారు. రైతులు ఇచ్చిన ధాన్యానికి రసీదు కచ్చితంగా ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఎటువంటి అవకతవకలు జరగకూడదని ఐకెపి అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇందల్వాయి మా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, చింతల కిషన్, లింగాపూర్ సంతోష్ రెడ్డి, రాయసింగ్, పరశురాం నాయక్, ఐకెపి సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.
రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-13 22:31:22
Readmore >
ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-13 21:33:35
Readmore >
నిషేధిత ఆల్ప్రాజోలామ్ అక్రమ రవాణా భగ్నం – 101 గ్రాముల స్వాధీనం
Posted On 2026-04-13 20:40:46
Readmore >
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్
Posted On 2026-04-13 20:38:38
Readmore >
రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-04-13 19:58:53
Readmore >