Posted on 2025-10-21 12:05:27
డైలీ భారత్, మంచిర్యాల:మంచిర్యాల జిల్లా రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దాగామ శ్రీశైలం (25) ఆలుగామ గ్రామం సమీపంలోని ప్రాణహిత నదిలో స్నానానికి వెళ్లి దురదృష్టవశాత్తు గల్లంతయ్యాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న కోటపల్లి ఎస్‌ఐ రాజేందర్ స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
దీపావళి పండుగ సందర్భంలో మంగళవారం శ్రీశైలం నదిలో స్నానం చేయడానికి వెళ్లి నీటిలో మునిగిపోయిన విషయం తెలిసిందే.
సహాయక చర్యలను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రి శ్రీ వివేక్ గారు అధికారులను ఆదేశించారు. ఆ మేరకు ఎస్‌ఐ రాజేందర్, స్థానిక కాంగ్రెస్ నాయకులు గట్టు లక్ష్మన్ గౌడ్ తదితరులు నది వద్దనే ఉండి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
గాలింపు చర్యల కోసం పక్క రాష్ట్రం మహారాష్ట్ర అధికారులతో మాట్లాడి ఒక బోటును తీసుకురావడంతో పాటు గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు.
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >