| Daily భారత్
Logo




కోరుట్ల త్రిశక్తి మాత దేవాలయంలో లక్ష్మి కటాక్ష హోమం

News

Posted on 2025-10-21 12:08:11

Share: Share


కోరుట్ల త్రిశక్తి మాత దేవాలయంలో లక్ష్మి కటాక్ష హోమం

డైలీ భారత్, కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని గణేశ నవదుర్గా మండలి త్రిశక్తి ఆలయ సేవా సమితి ఆధ్వర్యంలో త్రిశక్తి మాత ఆలయంలో లక్ష్మి కటాక్ష హోమం ఘనంగా నిర్వహించారు.

లక్ష్మీకటాక్ష హోమం అనేది సంపద శ్రేయస్సు సమృద్ధిని పొందడానికి శ్రీ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి చేసే ఒక పూజా కార్యక్రమమని, ఈ హోమానికి వివిధ రకాల మంత్రాలు తామరపూలు నాణేలు వంటి వాటిని ఉపయోగిస్తారు. 

ఈ హోమం ద్వారా వ్యాపార అభివృద్ధి ధనలాభం ఇంటిలో సంపద వృద్ధి వంటి ప్రయోజనాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. లక్ష్మీ కటాక్ష హోమం యొక్క ముఖ్య ఉద్దేశాలు సంపద శ్రేయస్సు భౌతిక సంపద శ్రేయస్సు సమృద్ధిని జీవితంలోకి ఆకర్షించడం వ్యాపార అభివృద్ధి వ్యాపారులు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ధన లోటు లేకుండా ఉండటానికి ఈ హోమం జరుపుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడం ఆమె ఆశీర్వాదం కోసం ఇలాంటి హోమం నిర్వహిస్తుంటారు. 

పూజా పద్ధతులు మంత్ర పఠనం లక్ష్మీ కటాక్ష మంత్రాన్ని జపించడం తర్పణ హోమం చేయడం

తామరపూలతో పూజ లక్ష్మీదేవిని తామరపూలతో పూజించడం లేదా నేతిలో ముంచిన తామరపూలను హోమంలో వేయడం వంటివి చేయవచ్చు108 రూపాయి నాణేలతో లక్ష్మీదేవిని అలంకరించడం లేదా పూజించడం వంటివి చేస్తారు ప్రసాదంగా పూలు, స్వీట్లను సమర్పించాలి.


ఈ కార్యక్రమంలో గణేశ నవదుర్గా మండలి త్రిశక్తి ఆలయ సేవా సమితి అధ్యక్షులు కటుకం గణేష్, ఉపాధ్యక్షులు ఎలిగేటి సుమన్, ప్రధాన కార్యదర్శి వడ్లకొండ శ్రీనివాస్, సహాయ కార్యదర్శి మామిడిపల్లి రమేష్, కోశాధికారిగా అడువాల ప్రభాకర్, కార్యవర్గ సభ్యులు కటుకం రాజశేఖర్, గాజుల రమేష్, అనుమల్ల శంకర్, చింత లక్ష్మీనారాయణ, తాటిపాముల శ్రీనివాస్, దొంతుల నాగరాజు, సిరిపురం రాజ్ కుమార్, ఓలేపు దేవరాజం, లక్కంపల్లి విజయ్, తాటిపాముల మణికంఠ, మిట్టపల్లి రాకేష్ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

Posted On 2026-04-12 16:53:08

Readmore >
Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >
Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >
Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >
Image 1

సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి

Posted On 2026-04-11 21:25:59

Readmore >
Image 1

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ జేఏసీ నిరంతరం పోరాటం

Posted On 2026-04-11 21:20:31

Readmore >
Image 1

డి-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్

Posted On 2026-04-11 20:02:47

Readmore >