| Daily భారత్
Logo




మూసీ వరదలపై స్పందించిన పవన్ కల్యాణ్

News

Posted on 2025-09-27 11:50:51

Share: Share


మూసీ వరదలపై స్పందించిన పవన్ కల్యాణ్

జనసేన శ్రేణులకు కీలక ఆదేశాలు

డైలీ భారత్, హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కారణంగా హైదరాబాద్ మహానగరం తడిసిముద్దైంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మరోవైపు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలశయాల నుంచి వరద నీరు విడుదల చేయడవంతో మూసీ ఉగ్రరూపం దాల్చింది. ఈ పరిణామంతో పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలోకి భారీగా వదర నీరు వచ్చి చేరింది.

ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులకు, తెలంగాణ జనసేన పార్టీ ముఖ్య నాయకులు, శ్రేణులకు కీలక పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ వరద బాధితులకు అండగా నిలవాలని సూచించారు. వరద బాధితులకు మనోధైర్యం కల్పించి వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. తెలంగాణలో భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌ సహా అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయని, మూసీ వరదతో MGBS పరిసరాలు నీట మునిగాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టిందని పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు.


#mgbs #pawan Kalyan #musi #hyderabad 

Image 1

వివాహిత హత్య కేసులో ప్రియుడు అరెస్ట్

Posted On 2026-04-13 16:39:06

Readmore >
Image 1

Arrive Alive అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం

Posted On 2026-04-13 16:25:36

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమానికి విచ్చేసిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-13 16:20:40

Readmore >
Image 1

కామారెడ్డి లో భారీ దొంగతనం

Posted On 2026-04-13 16:18:09

Readmore >
Image 1

రిలే నిరాహార దీక్ష

Posted On 2026-04-13 16:16:21

Readmore >
Image 1

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో IQAC - FDP

Posted On 2026-04-13 16:09:23

Readmore >
Image 1

రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజల్లో మరింత చైతన్యం రావాలి : ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు

Posted On 2026-04-13 11:03:05

Readmore >
Image 1

యాక్సిస్ బ్యాంక్‌లో భారీ మోసం

Posted On 2026-04-13 08:36:04

Readmore >
Image 1

మేము కొన్ని తప్పులు చేశాము

Posted On 2026-04-12 22:37:33

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-04-12 18:47:01

Readmore >