| Daily భారత్
Logo




కొండా లక్ష్మణ్ బాపూజీ కలలుగన్న సమసమాజం కావాలంటే బహుజనులు రాజ్యాధికారం సాధించాలి

News

Posted on 2025-09-27 11:38:18

Share: Share


కొండా లక్ష్మణ్ బాపూజీ కలలుగన్న సమసమాజం కావాలంటే బహుజనులు రాజ్యాధికారం సాధించాలి

వరంగల్ జిల్లా (బీసీ హక్కుల సాధన సమితి) ప్రధాన కార్యదర్శి

 చింతకింది కుమారస్వామి  

వరంగల్ /నల్లబెల్లి, డైలీ భారత్ న్యూస్: 1915 సెప్టెంబర్ 27న నేటి కొమరం భీం జిల్లా వాంకిడి గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించిన కొండా లక్ష్మణ్ బాపూజీ  స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా, నిజాం రజాకార్ల దౌర్జన్యాలు, అగ్రకులాలు భూస్వామ్య,వెట్టిచాకిరి, అణిచివేత, బానిసత్వానికి వ్యతిరేకంగా తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారని కుమారస్వామి అన్నారు. బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో సామాల వీరన్న,బొద్దుల నర్సయ్య నేతృత్వంలో మండల కేంద్రమైన నల్లబెల్లి బస్టాండ్ ఆవరణలో జరిగిన కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి 110 జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ 1938లో పౌర హక్కుల ఉద్యమ సత్యాగ్రహంలో పాల్గొని పుత్లిబౌలిలో అరెస్టయ్యాడు 1940లో న్యాయవాద వృత్తి చేసేటప్పుడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వారి తరఫున వాదించి షేక్ బందగీ, చాకలి ఐలమ్మ కేసులను గెలిపించారన్నారు ,1940లో ఆంధ్ర మహాసభలో చేరి ఖద్దర్ వస్త్రాల ప్రచారం చేస్తూ అమ్మకాన్ని చేపట్టారన్నారు. 1942లో క్విట్ ఇండియా వందేమాతరం ఉద్యమంలో పాల్గొని ఆబిడ్స్ పోస్ట్ ఆఫీస్ పై కోఠిలో ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీపై జాతీయ జెండా ఎగరేసి సంచలనం సృష్టించాడన్నారు. నిజాం రాజును అంతమందించడం కోసం బాంబు దాడికి వ్యూహాన్ని రచించి సోలాపూర్ క్యాంపులో నారాయణరావు పవార్ గండయ్య గూడూరు నారాయణస్వామి జగదీష్ ఆర్య అనే నలుగురికి శిక్షణ ఇచ్చి 1947 డిసెంబర్ 4న నిజాం కారుపై సుల్తాన్ బజార్లో బాంబు దాడి చేయించాడన్నారు .ఆ కేసులో నారాయణరావుకు ఉరిశిక్ష ఇతరులకు జీవిత ఖైదు విధించగా ఈ కుట్ర కేసులో బాపూజీని ప్రాసిక్యూట్ చేశారన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో విష్నూర్ దేశ్ ముఖ్ రాంచంద్రారెడ్డిపై హత్యాయత్నం కేసులో హుస్నాబాద్ బాంబు కేసులో సిపిఐ నాయకులు రావి నారాయణరెడ్డి నల్ల నరసింహులు ఆరుట్ల రామచంద్రారెడ్డి ఇతరులపై వేసిన కుట్ర కేసులను వాదించి గెలిచాడన్నారు .1952లో ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి 57 లో చిన్న కొండూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై డిప్యూటీ స్పీకర్ గా నియమితులైనారన్నారు 1967లో భువనగిరి నుంచి గెలిచి కుటీర పరిశ్రమలు ఎక్సైజ్ మంత్రిగా పనిచేసిన అన్నారు 1973లో ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చినప్పటికీ అగ్రకులాలు కుట్రలు చేసి జలగం వెంగళరావును ముఖ్యమంత్రిగా చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి ద్రోహం తలపెట్టారన్నారు. 1958లో హుస్సేన్ సాగర్ తీరాన భూమి కొని నివాసం ఏర్పాటు చేసుకుని,1969 లోను 1996 లో వచ్చిన తొలి మలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా, 2001లో కేసీఆర్ ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి నివాస స్థలమైన జలదృశ్యంలోనే పురుడు పోసుకుందన్నారు. ఇది సహించలేని ముఖ్యమంత్రి చంద్రబాబు 2002లో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి నివాసాన్ని నేలమట్టం చేయగా అనంతరం కోర్టులో గెలిచి తిరిగి తన నివాసాన్ని నిర్మించుకోవడం జరిగింది అన్నారు 96 ఏళ్ల వయసులో కూడా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తెలంగాణ కోసం దీక్ష చేయడం జరిగిందన్నారు. తన జీవితాంతం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సామాజిక న్యాయం కోసం బహుజనుల రాజ్యాధికారం కోసం కృషి చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ 2012 సెప్టెంబర్ 21 లో మరణించడం జరిగిందన్నారు. షేక్ బందగి చాకలి ఐలమ్మ కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి ఎందరో బిసి కులాల నుండి పుట్టిన వారు అగ్రకుల అహంకారానికి , దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడటమే కాకుండా, శ్రమజీవుల రాజ్యం కోసం కృషి చేసిన వారికి బహుజనులు రాజ్యాధికారం సాధించడమే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో   ఉడుత రాజు జక్కుల రవి కోల లింగయ్య భూస కుమారస్వామి, గుండెబోయిన రాజన్న, కన్కం సాల్మన్, బాబు, బుట్టి జయాకర్, తంగెళ్ళ వేణు, తాడెం చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Image 1

రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజల్లో మరింత చైతన్యం రావాలి : ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు

Posted On 2026-04-13 11:03:05

Readmore >
Image 1

యాక్సిస్ బ్యాంక్‌లో భారీ మోసం

Posted On 2026-04-13 08:36:04

Readmore >
Image 1

మేము కొన్ని తప్పులు చేశాము

Posted On 2026-04-12 22:37:33

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-04-12 18:47:01

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు

Posted On 2026-04-12 18:45:08

Readmore >
Image 1

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

Posted On 2026-04-12 16:53:08

Readmore >
Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >