Posted on 2025-09-25 13:45:20
చందుర్తి మండలం మూడపల్లి పల్లె దవాఖానలో స్వస్థ్ నారి, సాశక్త్ పరివార్ అభియాన్ పరిశీలన
డైలీ భారత్, చందుర్తి: స్వస్థ్ నారి, సాశక్త్ పరివార్ అభియాన్ కింద జిల్లాలోని ప్రతి మహిళకు వైద్య పరీక్షలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.
ఈ నెల 17 వ తేదీ నుంచి వచ్చే నెల 2 వ తేదీ వరకు కొనసాగనున్న స్వస్థ్ నారి, సాశక్త్ పరివార్ అభియాన్ లో భాగంగా చందుర్తి మండలం మూడపల్లి పల్లె దవాఖానలో గురువారం మహిళలకు వైద్య శిబిరం నిర్వహించగా, కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహిళలకు వివిధ పరీక్షలు వైద్యులు, సిబ్బంది చేస్తుండగా ఆరా తీశారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ...
ప్రతి రోజూ ప్రత్యేక వైద్య నిపుణులు ఆసుపత్రుల్లో అన్ని ఆరోగ్య పరీక్షలు చేస్తారని తెలిపారు. మహిళల్లో ఎక్కువగా కనిపించే రక్తహీనత డయాబెటిస్, రక్తపోటు సమస్యలపై ప్రత్యేక పరీక్షలు సలహాలు అందించాలని సూచించారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య మహిళా శక్తివంతమైన కుటుంబము అనే కార్యక్రమం కింద ప్రత్యేక వైద్య నిపుణులతో కంటి పరీక్షలు, చెవి ముక్కు గొంతు, రక్తపోటు, డయాబెటిస్, దంత పరీక్షలు, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ పరీక్షలు, గర్భిణీ స్త్రీలకు పరీక్షలు, టీబీ పరీక్షలు చేస్తారని, సికిల్ సెల్ ఎనీమియా, మాతా శిశు సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి కొరకు వంట నూనెలను తగ్గించడం ద్వారా ఊబకాయాన్ని తగ్గించడం, రుతుక్రమ పరిశుభ్రత, పోషకాహారం గురించి మహిళలకు అవగాహన కల్పిస్తారని వివరించారు.
రక్తహీనత ఉన్న గర్భిణులు, బాలింతల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వారికి కావలసిన మందులు, పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించాలని ఆదేశించారు. మహిళలు శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
శిబిరంలో వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు
Posted On 2026-04-11 10:47:57
Readmore >
సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు
Posted On 2026-04-11 08:51:32
Readmore >
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >